కోడిగాండ్లపల్లెను ముంపు గ్రామంగా ప్రకటించేందుకు కృషి : ఎమ్మెల్యే

ABN , First Publish Date - 2020-12-18T05:07:26+05:30 IST

కోడిగాండ్లపల్లెను గండికోట ప్రా జెక్టు ముంపు గ్రామంగా ప్రకటించేందుకు కృషిచేస్తానని ఎమ్మె ల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు.

కోడిగాండ్లపల్లెను ముంపు గ్రామంగా ప్రకటించేందుకు కృషి : ఎమ్మెల్యే
బ్యాక్‌ వాటర్‌ను పరిశీలిస్తున్న ఎమ్మెల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి

ముద్దనూరు, డిసెంబరు 17: కోడిగాండ్లపల్లెను గండికోట ప్రా జెక్టు ముంపు గ్రామంగా ప్రకటించేందుకు కృషిచేస్తానని ఎమ్మె ల్యే డాక్టర్‌ సుధీర్‌రెడ్డి పేర్కొన్నారు. గండికోట  బ్యాక్‌ వాటర్‌ కోడిగాండ్లపల్లెలోకి చేరడంతో గురువారం ఎమ్మెల్యే  అక్కడికి వెళ్లి పరిస్థితిని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన  మా ట్లాడుతూ కోడిగాండ్లపల్లె బ్యాక్‌వాటర్‌కు అతిసమీపంలో ఉండటంతో ప్రాజెక్టులోకి  21టీఎంసీలు రావడంతో గ్రామంలోకి బ్యాక్‌ వాటర్‌ వస్తోందన్నారు. ఇందుకు సమగ్ర నివేదిక తయారు చేసి ప్రభుత్వానికి పంపాలని జీఎన్‌ఎ్‌సఎ్‌స, ఇరిగేషన్‌ అధికారులకు ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మునిరాజారెడ్డి, వైసీపీ మండల కన్వీనర్‌ శ్రీధర్‌రెడ్డి, జీఎన్‌ఎ్‌సఎ్‌స ఇరిగేషన్‌ ఈఈ రామాంజనేయులు, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. 


 ఎమ్మెల్యేని కలిసిన ఒంటిగారిపల్లె వాసులు

మండలపరిధిలోని ఒంటిగారి పల్లె గ్రామస్తులు గురువారం ఎమ్మెల్యేను కలిసి వామికొండ ప్రాజెక్టు వల్ల గ్రామంలో నీటి ఊటలు భారీగా ఏర్పడ్డాయని  గ్రామాన్ని ముంపు గ్రామంగా ప్రకటించాలని  కోరారు. 

Updated Date - 2020-12-18T05:07:26+05:30 IST