శనగ బాధితులకు క్వింటాకు 4వేలు అందిస్తాం

ABN , First Publish Date - 2020-12-20T05:37:38+05:30 IST

మండలంలోని చిన్నశె ట్టిపల్లెలోని ఓ గోడౌన్‌లో శనగ బస్తాలు పెట్టిన రైతు లకు క్వింటాకు 4వేల రూపాయలు ఇచ్చేలా గౌరా భరత్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు, గోడౌన్‌ సభ్యులు నిర్ణయించారని రూరల్‌ సీఐ విశ్వనాథనారెడ్డి, ఎస్‌ఐ క్రిష్ణంరాజు నాయక్‌లు పేర్కొన్నారు.

శనగ బాధితులకు క్వింటాకు 4వేలు అందిస్తాం
సమావేశంలో పాల్గొన్న రైతులు

రాజుపాళెం, డిసెంబరు 19 :మండలంలోని  చిన్నశె ట్టిపల్లెలోని ఓ గోడౌన్‌లో శనగ బస్తాలు పెట్టిన రైతు లకు క్వింటాకు 4వేల రూపాయలు ఇచ్చేలా గౌరా భరత్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు, గోడౌన్‌ సభ్యులు నిర్ణయించారని  రూరల్‌ సీఐ విశ్వనాథనారెడ్డి, ఎస్‌ఐ క్రిష్ణంరాజు నాయక్‌లు పేర్కొన్నారు. ఆమేరకు  శని వారం గోడౌన్‌లో నిల్వ ఉంచిన శనగలు, ధనియాల  రైతులతో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించి మా ట్లాడుతూ దాదాపు 90 మంది రైతులను బాధితులు గా గుర్తించామని వారందరికీ న్యాయం చేసేలా గౌరా భరత్‌కుమార్‌రెడ్డి కుటుంబీకులు, గోడౌన్‌ సభ్యులు ముం దుకు రావడం  అభినందననీయమన్నారు. వారి తీర్మా ణం ప్రకారం క్వింటాకు 4వేలు చొప్పున 6 నెలల్లో రైతులకు నగదు చెల్లించేలా చర్యలు తీసుకున్నట్లు  పేర్కొన్నారు. కాగా చిన్నశెట్టిపల్లెలోని గోడౌన్‌ను  రామ్మోహన్‌రెడ్డితో కలిసి గౌరా భరత్‌కుమార్‌రెడ్డి ఏర్పాటు చేయగా అందులో రైతులు ధానం్య నిల్వ ఉంచారు. అయితే రామ్మోహన్‌ 96 కోట్లకు ఐపీ పెట్టి వెళ్లగా పార్టనర్‌గా ఉన్న భరత్‌కుమార్‌రెడ్డి అన్యాయాన్ని భరించలేక గతనెల 30వ తేదీన ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో బాధిత రైతులకు ఏదోలా న్యాయం చేయాలన్న లక్ష్యం తో భరత్‌కుమార్‌ తల్లిదండ్రులు పోలీసుల సమక్షంలో వారి ఆస్తులను అమ్మి వారి రొక్కం చెల్లిస్తామని తీర్మానించారు. వారి నిర్ణయంపట్ల బాధిత రైతులతోపాటు పోలీసు అధికా రులు హర్షం వ్యక్తం చేశారు.



Updated Date - 2020-12-20T05:37:38+05:30 IST