అవినీతిపై మాట్లాడితే చంపడం దారుణం

ABN , First Publish Date - 2020-12-30T05:26:46+05:30 IST

వైసీపీ నేతల అవినీ తి, అక్రమాలపై గళం విప్పినందుకు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేయ డం దుర్మార్గపు చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథశర్మ పేర్కొన్నారు.

అవినీతిపై మాట్లాడితే చంపడం దారుణం
సుబ్బయ్య మృతదేహం వద్ద నివాళులర్పిస్తున్న ప్రవీణ్‌కుమార్‌రెడ్డి

ప్రొద్దుటూరు, డిసెంబరు 29 :  వైసీపీ నేతల అవినీ తి, అక్రమాలపై గళం విప్పినందుకు టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్యను హత్య చేయ డం దుర్మార్గపు చర్య అని ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి కాశీభట్ల సత్యసాయినాథశర్మ పేర్కొన్నారు. మంగళవారం ప్రొద్దుటూరులో హత్యకు గురైన నందం సుబ్బయ్య మృతదేహాన్ని ఆయన సందర్శించి నివాళులర్పించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ హత్యారాజకీయాలను ప్రొత్సహించడం తగదన్నారు.  ఇలాంటి హత్యలు చేసి, పార్టీ కార్యకర్తలను, నాయకులను భయాందోళనలకు గురి చేయాలని వైసీపీ నేతలు చేస్తున్న ప్రయత్నాలను తెలుగుదేశం పార్టీ నాయకులు కలిసికట్టుగా ఎదుర్కోవాలన్నారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని డిమాండ్‌ చేశారు. అదేవిధంగా పార్టీ పరంగా కూడా ఆదుకోవాలని తమ అధినేత చంద్రబాబునాయుడుకు లేఖ రాయనున్నట్లు ఆయన వివరించారు. 

నందం సుబ్బయ్య హత్య దుర్మార్గపు చర్య

ప్రొద్దుటూరు క్రైం, డిసెంబరు 29 : టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్య దుర్మార్గపు చర్య ఆపార్టీ ప్రొద్దుటూ రు నియోజకవర్గ ఇన్‌చార్జి జీవీ ప్రవీణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. ఈశ్వర్‌రెడ్డినగర్‌లోని మృతుని నివాసానికి వెళ్లి నివాళులర్పించారు. ఆయన వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు. 

మాజీ ఎమ్మెల్యే వరద నివాళి

ప్రొద్దుటూరు, డిసెంబరు 29 : టీడీపీ జిల్లా అధికార ప్రతినిధి నందం సుబ్బయ్య హత్యకు గురైన సమాచారం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి జిల్లా ఆస్పత్రికి వచ్చి మృతదేహన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆయన కుటుంబసభ్యులను పరామర్శించారు. తమకు జరిగిన అన్యాయాన్ని వరద ఎదుట మృతుని తల్లి, భార్య ఏకరవు పెట్టారు. వరదవెంట ఆయన సోదరుడు మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, ఘంటసాల వెంకటేశ్వర్లు తదితరులు ఉన్నారు. 

ఎర్రగుంట్లలో..

ఎర్రగుంట్ల, డిసెంబరు 29: టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి, పొద్దుటూరులో బీసీనాయకుడుగా ఎదిగిన నందం సుబ్బయ్యను హత్య చేయడం దారుణమని టీడీపీ జిల్లా కార్యదర్శి సుంకర నాగేశ్వరరావు పేర్కొన్నారు. అవినీతిని, అక్రమాలను ప్రశ్నించే వారిని చంపించేందుకు కూడా  ఈ ప్రభుత్వం వెనకాడటం లేదని ఆయన విమర్శించారు. ప్రొద్దుటూరులో జరుగుతున్న అరాచకాలను వేలెత్తి చూపినందుకు హత్య చేయించారని ఆరోపించారు.  వారి కుటుంబానికి సానుభూతిని తెలిపారు. అలాగే పార్టీ ఎప్పటికి అండగా ఉంటుందని పేర్కొన్నారు. 



Updated Date - 2020-12-30T05:26:46+05:30 IST