జై కాశినాయన.... భక్తుల వేడుకోలు
ABN , First Publish Date - 2020-12-30T05:11:17+05:30 IST
అభాగ్యులకు ఆరాధ్యదైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు కాశినాయన ఆరాధనోత్సవం వైభవంగా నిర్వహించారు.
వైభవం కాశినాయన ఆరాధనోత్సవం
- తరలివచ్చిన భక్తజనం
ఖాజీపేట, డిసెంబరు29: అభాగ్యులకు ఆరాధ్యదైవం కోరిన కోర్కెలు తీర్చే కల్పతరువు కాశినాయన ఆరాధనోత్సవం వైభవంగా నిర్వహించారు. స్థానిక పత్తూరులో వెలసిన అవదూత కాశినాయన ఆశ్రమం లో 24వ ఆరాధనోత్సవం మంగళవారం ప్రారంభమైంది. స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం చెక్కభజన చూపరులను అలరించింది. భక్తులు స్వామివారిని దర్శించుకుని కాయ కర్పూరం సమర్పించి తమ భక్తిని చాటుకున్నారు. భక్తులకు అన్నదానం నిర్వహించారు.
