శివోహం..
ABN , First Publish Date - 2020-12-01T06:04:47+05:30 IST
కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి.
శివాలయాలకు పోటెత్తిన భక్తులు
ఘనంగా కార్తీక పౌర్ణమి
్డకడప (మారుతీనగర్), నవంబరు 30 : కార్తీక పౌర్ణమి, మూడో సోమవారం సందర్భంగా జిల్లాలోని అన్ని శైవక్షేత్రాలు భక్తులతో కళకళలాడాయి. చిన్నాపెద్దా అనే తారతమ్యంలేకుండా ఆ పరమశివుని సన్నిధిలో దీపాలు వెలిగించి భక్తి పారవశ్యం పొందారు. జిల్లాలోని ప్రసిద్ధ శైవక్షేత్రాలైన పొలతల, పుష్పగిరి, హత్యరాల, నిత్యపూజకోన, గుండాలకోన, కడప నగరంలోని మృత్యుంజయకుంట, మోచంపేట శివాలయాలు, దేవునికడపలోని సోమేశ్వరాలయాలలో భక్తులు తెల్లవారుజామునే కార్తీక దీపాలు వెలిగించారు.
