-
-
Home » Andhra Pradesh » Kadapa » Karona
-
కరోనా నుంచి ప్రజలు కోలుకోవాలి
ABN , First Publish Date - 2020-11-22T05:19:42+05:30 IST
ప్రస్తుత కరోనా భారీ నుంచి ప్రజలు తక్షణం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు విశాఖ శారదాపీఠం ఉత్తరా ధికారి శ్రీస్వాత్మానందేంద్రసరస్వతిస్వామి పేర్కొన్నారు.

శ్రీస్వాత్మానందేంద్రసరస్వతిస్వామి
ప్రొద్దుటూరు టౌన్, నవంబరు 21: ప్రస్తుత కరోనా భారీ నుంచి ప్రజలు తక్షణం కోలుకోవాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహిస్తున్నట్లు విశాఖ శారదాపీఠం ఉత్తరా ధికారి శ్రీస్వాత్మానందేంద్రసరస్వతిస్వామి పేర్కొన్నారు. శనివారం ప్రొద్దుటూరుకు విచ్చేసి భక్తులను ఆశీర్వ దించారు. అనంతరం మాజీ కౌన్సిలర్ రమేష్‌రెడ్డి నివా సానికి చేరుకోగానే ఈ పెద్ద సంఖ్యలో భక్తులు స్వామి వారిని దర్శించుకుని ఆశీర్వాదాలు పొందారు. అనంతరం రమేష్‌రెడ్డి నివాసంలో స్వామి ప్రత్యేక పూజలు నిర్వ హించారు. ఈ సందర్భంగా స్వామి ప్రజలు సుఖసంతో షాలతో జీవించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో భక్తులు శ్రీకాంత్‌రెడ్డి, మనోహర్‌రెడ్డి, నల్లం రవిశంకర్, కుమార్, పవన్‌కుమార్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.