గుప్త నిధుల తవ్వకాలపై వస్తున్న వార్తలు అవాస్తవం : కడప ఎస్పీ

ABN , First Publish Date - 2020-09-29T21:35:53+05:30 IST

కడప : జిల్లాలోని జమ్మలమడుగులోని పొన్నతోట ఆంజనేయ స్వామి, వినాయక స్వామి ఆలయంలో

గుప్త నిధుల తవ్వకాలపై వస్తున్న వార్తలు అవాస్తవం : కడప ఎస్పీ

కడప : జిల్లాలోని జమ్మలమడుగులోని పొన్నతోట ఆంజనేయ స్వామి, వినాయక స్వామి ఆలయంలో గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిగాయని మీడియా, సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకున్న పోలీసులు అసలేం జరిగింది..? అని ఆరాతీశారు. తీరా చూస్తే అదంతా అవాస్తవమేనని తేలింది. ఇందుకు సంబంధించి జిల్లా ఎస్పీ అన్బురాజన్ మీడియా మీట్ ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు.


అదంతా అవాస్తవమే..

గుప్త నిధుల కోసం తవ్వకాలపై వస్తున్న వార్తలు అవాస్తవం. ఇటీవల కురిసిన భారీ వర్షాలకు ఆలయ పరిసరాల్లో నీరు నిల్వ ఉండటంతో గుంతలు పడ్డాయని రెవెన్యూ అధికారులు, పోలీసులు నిర్ధారించారు. ఘటన స్థలానికి వెళ్లి మరీ పోలీసులు, అధికారులు పరిశీలించారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు అంటూ కొంత మంది వ్యక్తులు చేసిన పోస్ట్‌లు వైరల్ అయ్యాయి. ఇలాంటి విషయాలపై పుకార్లు సృష్టించవద్దు అని మీడియా ముఖంగా అన్బురాజన్ వెల్లడించారు.

Updated Date - 2020-09-29T21:35:53+05:30 IST