ఇసుక డంపింగ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

ABN , First Publish Date - 2020-03-21T08:19:48+05:30 IST

మండల పరిధిలోని బయనపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఇసుక డంపింగ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ..

ఇసుక డంపింగ్‌ను అడ్డుకున్న గ్రామస్తులు

బద్వేలు రూరల్‌, మార్చి 20 : మండల పరిధిలోని బయనపల్లె గ్రామ సమీపంలో శుక్రవారం రాత్రి ఇసుక డంపింగ్‌ను గ్రామస్తులు అడ్డుకున్నారు. వివరాల్లోకి వెళితే.. రెండునెలల క్రితం ఈ స్థలంలో ఇసుక డంపింగ్‌ చేసుకునేందుకు ఓ వ్యక్తి అధికారుల నుంచి అనుమతులు పొందాడు. ఆ సమయంలో ఇసుక నిల్వ చేసుకునేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకోవడంతో వివాదం జరిగింది. అధికారులు సర్దిచెప్పడంతో ఆ గొడవ అప్పటికి సర్దుమనిగింది. అయితే శుక్రవారం రాత్రి సమయంలో అనుమతి పొందిన వ్యక్తి ఇసుకను నిల్వ చేసేందుకు ప్రయత్నం చేయగా గ్రామస్తులు తిరిగి అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న రూరల్‌ ఎస్‌ఐ లలిత సంఘటనా స్థలానికి చేరుకొని.. ఇసుక నిల్వకు అనుమతులపై తహసీల్దార్‌ దగ్గరకు వెళ్లి సమస్య పరిష్కరించుకోవాలని సూచించడంతో వివాదం సర్దుమనిగింది.

Updated Date - 2020-03-21T08:19:48+05:30 IST