-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news pcc working committee president tulasireddy
-
ఈసీకి సీఎం క్షమాపణ చెప్పాలి - తులసిరెడ్డి
ABN , First Publish Date - 2020-03-23T09:48:43+05:30 IST
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి...

వేంపల్లె, మార్చి 22: రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ రమేష్‌కుమార్‌కు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి క్షమాపణ చెప్పాలని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ నర్రెడ్డి తులసిరెడ్డి పేర్కొన్నారు. కరోనా ఎఫెక్ట్‌ను కేంద్రం జాతీయ విపత్తుగా ప్రకటించగా రాష్ట్రంలో స్థానిక సం స్థల ఎన్నికలను కమిషనర్ వాయిదా వేశారు. కరోనాను సాకుగా చూపుతూ కుట్ర పూరితం గా కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అడ్డు కునేందుకే ఎన్నికలు వాయిదా వేశారని ఎన్నికల కమిషనర్‌ను దూషించారని గుర్తుచేశారు. నిధులు రాకుంటే రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడుతుందని, అందుకే ఎన్నికల కమిషన్ ఎన్నికలను వాయిదా వేసిందని, ముఖ్యమంత్రి, మంత్రులు, వైసీపీ నేతలు పదేపదే విమర్శలు గుప్పించారన్నారు. రాష్ట్ర ఎన్నికల కమిషన్ నిర్ణయాన్ని సుప్రీం కోర్టు సమర్థించి, కమిషనర్ చెప్పినట్లుగానే 14వ ఆర్థిక సం ఘం నిధులు రూ.1301కోట్లు రాష్ట్రానికి వచ్చాయన్నారు. దీనికి ముఖ్యమంత్రి సమాధానం చెప్పాలని ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.