-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news janatha curfew
-
జనతా కర్ఫ్యూ సక్సెస్
ABN , First Publish Date - 2020-03-23T09:47:41+05:30 IST
జీవితంలో... ఇటువంటి కర్ఫ్యూ కళ్లారా చూసి ఉండలేదు... ఇక చూడలేం.... రోడ్లపైకొస్తే మనం ఎడారిలో...

రాజంపేట, మార్చి22 : జీవితంలో... ఇటువంటి కర్ఫ్యూ కళ్లారా చూసి ఉండలేదు... ఇక చూడలేం.... రోడ్లపైకొస్తే మనం ఎడారిలో ఉన్నామా.. ఇంకెక్కడున్నాం... అన్న భయం కలిగిందంటే పచ్చినిజం. పెద్దపెద్ద భవంతులు ఎదురుగావున్నా ఏదో తెలియని నిశ్శబ్ద వాతావరణం ముందుర మనం ఒంటరివారమయ్యామా అన్న అనుభూతి మిగిలింది. ఇది రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాల్లో జనతా కర్ఫ్యూ సంగతి. తెల్లవారుజాము నుంచే పూర్తిగా కర్ఫ్యూ వాతావరణం కనిపించిది. కాగా రాజంపేట డీఎస్పీ నారాయణస్వామిరెడ్డి నేతృత్వంలో రాజంపేట పట్టణ, రూరల్ పోలీసులు రాజంపేట పట్టణాన్ని పహారాకాశారు.
ఒంటిమిట్టలో...
ఒంటిమిట్ట, మార్చి22 : మండల వ్యాప్తంగా జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. మండలంలోని ప్రజలు, పల్లెల్లో స్వచ్ఛందంగా మద్దతు పలికారు. సీఐ హనుమంతునాయక్, ఎస్‌ఐ అమర్‌నాధరెడ్డి కట్టుదిట్టమైన బందోబస్తును ఏర్పాటు చేశారు. రోడ్లు నిర్మానుష్యంగా కనిపించాయి. పోలీసు సిబ్బంది ఏఎ్‌సఐ గౌరీనాధ, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
నందలూరులో...
నందలూరు, మార్చి22 : జనతా కర్ఫ్యూను మండల వాసులు స్వచ్ఛందంగా ఇళ్లలోనే ఉండి పాటించారు. ఆదివారం ఉదయం 7గంటల నుంచే దుకాణాల సైతం మూసివేయడంతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎస్‌ఐ లక్ష్మీప్రసాద్‌రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.
సుండుపల్లెలో...
సుండుపల్లె, మార్చి 22: జనతా కర్ఫ్యూ మం డలంలో ఆదివారం విజయవంతమైంది. ఇందులో భాగంగా ఉదయం 7 గంటల నుంచే దుకాణాదారులు తెరవలేదు. పలు ప్రైవేటు ఆసుపత్రులతో పాటు మందుల దుకాణాలు కూడా నిర్వాహకులు మూసివేసి కర్ఫ్యూకు మద్దతు పలికారు. అధికారులు, తహసీల్దార్ కనకదుర్గయ్య, ఎస్‌ఐ భక్తవత్సలం, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, వైద్యులు నిఘా ఉంచారు. కర్ఫ్యూలో భాగంగా ఎస్‌ఐ భక్తవత్సలం, పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తూ బ యట కనిపించే వారిని చైతన్యం చేశారు.
వీరబల్లిలో...
వీరబల్లి, మార్చి 22: ప్రఽధానమంత్రి నరేంద్రమోదీ పిలుపు మేరకు ఆదివారం మండలంలో చేపట్టిన జనతా కర్ఫ్యూ విజయవంతమైంది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాల మూసివేసి కర్ఫ్యూకు మద్దతు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ఎస్‌ఐ రామాంజనేయులు గ్రామాల్లో గస్తీ నిర్వహించారు.
రైల్వేకోడూరులో...
రైల్వేకోడూరు/రూరల్, మార్చి, 22: కరోనా వైరస్‌ను కట్టడి చేయడానికి మండలం లో స్వచ్ఛందంగా కర్ఫ్యూ ను ప్రజలు పాటించారు. ఇళ్లకే పరిమితం అయ్యారు. స్వచ్ఛందంగా దుకాణ దారులు మూసివేశారు. మెడికల్ దుకాణాలు, ఆస్పత్రులు తెరిచి వైద్య సేవలు అందించారు. ముందస్తు చర్యగా రైల్వేకోడూరు సీఐ ఆవుల ఆనందరావు, శిక్షణ డీఎ్‌సపీ ప్రసాద్‌రావు, ఎస్‌ఐ ఈఈవీ నరసింహం బందోబస్తు ఏర్పాటు చేశారు. బంగారు వ్యాపారులు జనతా కర్ఫ్యూను పాటిస్తూ దుకాణాలను స్వచ్ఛందంగా మూసివేశారు.
ఓబులవారిపల్లెలో...
ఓబులవారిపల్లె, మార్చి22 : ఓబులవారిపల్లె మం డలంలో జనతా కర్ఫ్యూ ఆదివారం విజయవంతమైంది. ప్రజలు స్వచ్ఛందంగా కర్ఫ్యూ పాటించారు. మంగంపేట ఏపీఎండీసీ బెరైటీస్ గనులలో పనులు జరగకబోసిపోయాయి. జనతా కర్ఫ్యూతో తవ్వకవాల కాంట్రాక్టర్ స్వచ్ఛందంగా పనులు నిలిపివేశారు. ఒకటి రెండు ముఖ్యశాఖలు మినహా ఇంచి ఏపీఎండీసీ పూర్తిగా కర్ఫ్యూకు మద్దతు ప్రకటించింది.
పెనగలూరులో...
పెనగలూరు, మార్చి22 : మండలంలో జనతా కర్ఫ్యూకు ప్రజలు సంపూర్ణమద్దతు పలికారు. ఉదయం 7గంటల నుంచి సాయంత్రం వరకు జనం ఇళ్లకే పరిమితమయ్యారు. పెనగలూరు ఎస్‌ఐ చెంగల్‌రాయులు ఆధ్వర్యంలో పోలీసుల గ్రామాలలో నిరంతరాయంగా కలియదిరిగారు. ప్రజలు జనతా కర్ఫ్యూను స్వచ్ఛందంగా నిర్వహించారు. ప్రైవేటు క్లీనిక్‌లు మూసేశారు.కాగా జనతా కర్ఫ్యూ సందర్భంగా జాతికి సంఘీభావం తెలుపుతూ మాజీ ఎమ్మెల్యేలు కొండూరు ప్రభావతమ్మ, ఆకేపాటి అమర్‌నాధరెడ్డి చప్పట్లు కొట్టారు. మాజీ జెడ్పీటీసీ కొండూరు విజయ్‌రెడ్డి, ఏజీపీ గురుప్రతా్‌పరెడ్డి తదితరులు పాల్గొన్నారు.
చిట్వేలిలో...
చిట్వేలి, మార్చి22 : ఆదివారం ఉదయం 7గంటల నుంచి రాత్రి 9గంటల వరకు నిర్వహించిన జనతా కర్ఫ్యూతో రోడ్లన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. దుకాణాదారులు స్వచ్ఛందంగా మూసి ఇళ్లకు పరిమితమయ్యారు. తహసీల్దారు , ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కర్ఫ్యూను పర్యవేక్షించారు. జనతా కర్ఫ్యూ విజయవంతంగా జరిగింది.
పుల్లంపేటలో...
పుల్లంపేట, మార్చి22 : జనతా కర్ఫ్యూ పుల్లంపేట మండలంలో విజయవంతమైంది. స్వచ్ఛందంగా దుకాణాలు మూసివేశారు. సాయంత్రం 5గంటలకు ప్రధాన రోడ్డులో ప్రజలు తమ ఇంటి ముం దుకు వచ్చి పోలీసులతో కలిసి అత్యవసర సేవలు అందించిన ప్రతిఒక్కరికీ చప్పట్లు కొట్టారు.
పులివెందులలో...
పులివెందుల, మార్చి 22: ప్రధాని నరేంద్ర మోదీ ఇచ్చిన పిలుపు మేరకు పులివెందుల నియో జకవర్గంలో ఆదివారం నిర్వహించిన జనతా క ర్ఫ్యూ విజయవంతమైంది. ఉదయం 7గంటల నుంచే పులివెందుల పట్టణంలో దుకాణాలు పూర్తిగా మూతపడ్డాయి. ప్రధాన వీధులన్నీ నిర్మానుష్యంగా మారిపోయాయి. పులివెందుల సీఐ భాస్కర్‌రెడ్డి కర్ఫ్యూను పరిశీలించారు. వేంపల్లె మండలంలో జనతా కర్ఫ్యూ పూర్తిస్థాయిలో సాగింది. ప్రధాన వీదులన్నీ నిర్మానుష్యంగా మారిపోయా యి. పోలీసులు ప్రధాన వీధుల్లో తిరుగుతూ కర్ఫ్యూనకు సహకరించారు. చక్రాయపేట మండలంలో కర్ఫ్యూ విజయవంతమైంది. వేముల మండలంలో కరోనాపై కర్ఫ్యూ విజయవంతమైంది.
లింగాల మండలంలో దుకాణాలు, హోటళ్లు స్వచ్ఛందంగా మూసివేసి కర్ఫ్యూనకు మద్దతు పలికారు. తొండూరులో కర్ఫ్యూ పూర్తిస్థాయిలో సాగింది. సింహాద్రిపురం మండలంలో కూ డా కర్ఫ్యూ పూర్తిస్థాయిలో విజయవంతమైంది. పులివెందులలో ఆర్టీసీ బస్సులు గ్యారేజీకే పరిమితమయ్యాయి. కాగా పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో విదేశాల నుంచి వచ్చిన వారు నివసిస్తుంటే వారిపై 28 రోజుల పాటు గట్టి నిఘా ఉంచాలని మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి తెలిపారు. దేశాల నుంచి వచ్చిన 47 మందిని గుర్తించి వారిని క్వారంటైన్ చేశారు. వీరిని 28 రో జుల ఇంటి నుంచి బయటకు రావద్దని చెప్పారు.
వేంపల్లెలో... దుకాణాలను మూసివేశారు. వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రజలంతా ఇళ్లలోనే ఉండి కరోనా వ్యాప్తి చెందకుండా తమవంతు కృషిచేశారు. వీధులన్నీ నిర్మానుష్యంగా కనిపించాయి. సాయంత్రం 5గంటల ప్రాంతంలో ఇళ్ల నుంచి బయటకు వచ్చి చప్పట్లతో సంఘీభావం తెలిపారు.