హమ్మయ్యా.. విదేశీ కరోనా రాలేదు

ABN , First Publish Date - 2020-03-23T09:39:50+05:30 IST

హమ్మయ్యా... విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన జిల్లా వాసుల కు కరోనా లక్షణాలు కనిపించలేదు. కరోనా వై రస్‌ విదేశాలను పట్టిపీడిస్తోంది. అక్కడ అం టించుకొని మన దేశంకు..

హమ్మయ్యా.. విదేశీ కరోనా రాలేదు

  • 2405 మందిలో కనిపించని లక్షణాలు 
  • ఊపిరిపీల్చుకున్న యంత్రాంగం 


కడప, ఆంధ్రజ్యోతి మార్చి 22 : హమ్మయ్యా.. విదేశాల నుంచి జిల్లాకు వచ్చిన జిల్లా వాసుల కు కరోనా లక్షణాలు కనిపించలేదు. కరోనా వై రస్‌ విదేశాలను పట్టిపీడిస్తోంది. అక్కడ అం టించుకొని మన దేశంకు రావడంతో ఇక్కడ కూడా వైరస్‌ వ్యాప్తి చెందుతుంది. విదేశాల నుంచి వచ్చిన వారితోనే రాష్ట్రంలో కూడా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో విదేశాల నుంచి వస్తున్నారంటే జనంతో పాటు అధికార యంత్రాంగం బెంబేలెత్తే పరిస్థితికి వచ్చింది. ఉపాధి లేక జిల్లా వాసులు పొట్టకూటికోసం పలువురు గల్ఫ్‌ దేశాలకు వెళ్లారు. మరికొందరు విద్యా, ఉద్యోగ, వ్యాపార నిమిత్తం విదేశాల్లో ఉంటున్నారు. ఫిబ్రవరి 10 నుంచి విదేశాల నుంచి జిల్లాకు 2405 మంది వచ్చారు. కరోనా నేపధ్యంలో వారందరిపై వైద్య ఆరోగ్యశాఖ ప్రత్యేక దృష్టి సారించింది. వారందరి స మాచారాన్ని సేకరించింది.


దగ్గు, జలుబు, జ్వ రం తదితర లక్షణాలున్నాయో ఆరా తీసింది. వారి వివరాలను వైద్య ఆరోగ్యశాఖ యాప్‌ ద్వా రా సేకరించారు. మార్చి 10 నుంచి ఇప్పటి వ రకు 342 మంది వచ్చినట్లు గుర్తించారు. ఫోన్ల ద్వారా సమాచారాన్ని సేకరించారు. గల్ఫ్‌ నుం చి ఖాజీపేట, పుల్లంపేట వాసులు వచ్చారు. వీ రికి వైద్య పరీక్షలు నిర్వహించారు. రిమ్స్‌లో శనివారం నాటికి 11 మంది కరోనా అనుమానితులకు  శాంపుల్స్‌ సేకరించి తిరుపతిలో లాబ్‌ కు పంపించగా అందరికీ నెగిటీవ్‌ వచ్చింది. హోమ్‌ ఐసోలేషన్‌, స్వీయ నిబంధంలో 2130 మంది ఉన్నారు. 28 రోజులు ఐసోలేషన్‌ను 665 మంది పూర్తి చేసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన వారికి కరోనా లక్షణాలు లేకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు.

Updated Date - 2020-03-23T09:39:50+05:30 IST