-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news fire accident
-
షిరిడీసాయి ఎలక్ర్టికల్స్‌లో అగ్నిప్రమాదం
ABN , First Publish Date - 2020-03-23T09:41:39+05:30 IST
కడప నగరం ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లోని షిరిడీసాయి ఎలక్ర్టికల్ కం పెనీలో అదివారం షార్ట్ సర్క్యూట్‌తో...

కడప, క్రైం, మార్చి 22 : కడప నగరం ఇండ్రస్టియల్ ఎస్టేట్‌లోని షిరిడీసాయి ఎలక్ర్టికల్ కం పెనీలో అదివారం షార్ట్ సర్క్యూట్‌తో భారీ అ గ్నిప్రమాదం జరిగింది. కంపెనీలోని హొరిజొనటల్ ఎనిమల్ మిషన్ యూనిట్‌లోని యూపీ ఎస్ బ్యాటరీ రూమ్‌లో ప్రమాదం చోటు చేసు కున్నట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. మంటలు అదుపు కాకపోవడంతో మరో రెండు వాహనాల ద్వారా నీటిని తెప్పించి మంటలను అదుపులోకి తెచ్చినట్లు పేర్కొన్నారు. ప్రమాదం లో దాదాపు 2.5 కోట్ల విలువ చేసే పరికరాలు కాలి బూడిద అయినట్లు తెలిపారు. కంపెనీ యజమాని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చే సినట్లు తెలిపారు.
ఏబీఎన్ ఆంధ్రజ్యోతి విలేకరిపై దాడి
అగ్నిప్రమాద సమాచారం తెలుసుకున్న ఏబీఎన్-ఆంధ్రజ్యోతి కడప రిపోర్టర్ మధుసూదన్ వార్త కవరేజ్ కోసం సంఘటనా స్థలానికి ఆంధ్రజ్యోతి ఫొటోగ్రాఫర్ రత్నమయ్యతో కలిసి వెళ్లారు. వార్తలు కవర్ చేసేందుకు లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించగా కంపెనీ మేనేజర్ విలేకరి మధును అడ్డుకున్నారు. మీరు వార్త కవరేజ్‌కు వచ్చారు కదా ఏ మీడియా అంటూ అడగడంతో ఏబీఎన్-ఆంధ్రజ్యోతి పేరు చెప్పగానే ఒక్కసారిగా మేనేజర్, మరో ముగ్గురు కలిసి రిపోర్టర్‌పై దాడి చేయడంతో పాటు అతడి వద్ద ఉన్న కెమెరాలను సైతం లాక్కుని గేటు బయటకు నెట్టేశారు. పోలీసుస్టేషన్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్తున్న రిపోర్టర్‌ను సైతం అడ్డగించడంతో పాటు బెదిరింపులకు పాల్పడి అనంతరం తాము లాక్కున్న కెమెరాను అందించారు. ఈ మేరకు రిపోర్టర్ మధుపై దాడి చేసిన మేనేజర్, మరో ముగ్గురిపై రిమ్స్ పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.