సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం

ABN , First Publish Date - 2020-11-06T10:38:26+05:30 IST

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రకు పాల్పడుతున్నాయని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగించాలని విద్యుత్‌ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు.

సమస్యలు పరిష్కారమయ్యే వరకు ఉద్యమం

విద్యుత్‌ జేఏసీ నేతలుకడప (సిటి), నవంబరు 5 : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యుత్‌ సంస్థలను ప్రైవేటీకరణ చేసే కుట్రకు పాల్పడుతున్నాయని, తమ న్యాయమైన సమస్యలు పరిష్కారం అయ్యేంత వరకు ఉద్యమం కొనసాగించాలని విద్యుత్‌ జేఏసీ నేతలు పిలుపునిచ్చారు. విద్యుత్‌ భవన్‌ కడప డివిజన్‌ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా విద్యుత్‌ ఉద్యోగుల జేఏసీ జిల్లా కన్వీనరు చలపతి, రాష్ట్ర జేఏసీ కార్యవర్గ సభ్యుడు రామలింగారెడ్డి, జిల్లా కన్వీనరు చాన్‌బాష మాట్లాడుతూ దేశ స్థాయిలో ఎన్నో అవార్డులు పొందిన డిస్కంలను ప్రైవేటీకరించాలనుకోవడం దుర్మార్గమన్నారు. కార్మికులు, ఉద్యోగులు సంవత్సరాల తరబడి కోరుతున్న న్యాయమైన కోరికలు సాధించుకోవాలంటే ఐక్య పోరాటానికి అందరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో జేఏసీ నేతలు రమే్‌షరెడ్డి, శ్రీపతి, శిరీష, మల్లిఖార్జున, ప్రయాజ్‌బేగ్‌, సుదర్శన్‌రెడ్డి, ఉద్యోగులు పాల్గొన్నారు.

Updated Date - 2020-11-06T10:38:26+05:30 IST