కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు చెక్కులు పంపిణీ
ABN , First Publish Date - 2020-11-03T10:53:34+05:30 IST
కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు.
కడప (ఎర్రముక్కపల్లె), నవంబరు 2 : కరోనాతో మృతి చెందిన ఆర్టీసీ ఉద్యోగులకు ఉప ముఖ్యమంత్రి తన క్యాంపు కార్యాలయంలో చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి అంజద్‌బాషా మాట్లాడుతూ గత మే మాసంలో కడప డిపోకు చెందిన ఎస్.రమణమ్మ అనే కండక్టరు కరోనా సోకి మృతి చెందిందన్నారు. కడప ఆర్టీసీ జోన్ వర్క్‌షాపుకు సంబంఽధించిన సాదిక్ ఆలీ బ్లాక్‌స్మిత్‌గా పనిచేస్తూ కరోనాతో మృతి చెందాడన్నారు. ఆర్టీసీ ఉద్యోగులందరూ ఒకరోజు వేతనం విరాళంగా ఇచ్చి కరోనాతో మృతి చెందిన వారికి ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున ఆర్థిక సాయం అందజేయడం జరిగిందని తెలిపారు. ఈ నేపధ్యంలో ఒక్కొక్కరికి రూ.5 లక్షల చొప్పున మృతుల కుటుంబ సభ్యులకు చెక్కులు అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీ ఆదం సాహెబ్, ఆర్‌ఎం జితేంద్రనాధరెడ్డి, సీఎంఈ భాస్కర్, డీఎం నిరంజన్, ఆర్టీసీ అసోసియేషన్ నాయకులు బాబా ఫకృద్దీన్, బాల వెంకటేశ్, రెడ్డిబాషా తదితరులు పాల్గొన్నారు.