పాఠశాలలో 18 బస్తాల బియ్యం చోరీ
ABN , First Publish Date - 2020-11-03T10:50:15+05:30 IST
జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 18 బస్తాల బియ్యం చోరీ జరిగింది.
జమ్మలమడుగు రూరల్, నవంబరు 2: జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో 18 బస్తాల బియ్యం చోరీ జరిగింది. సోమవారం ఉదయం అర్బన్ పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ రవికుమార్‌కు పాఠశాల హెడ్మాస్టర్ జరీనాబేగం ఫిర్యాదు చేసింది. ఎస్.ఉప్పలపాడు గ్రామంలో ఎంపీపీ, రెగ్యులర్ పాఠశాలకు కలిపి మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించి గతనెల 27వ తేదీ తొమ్మిది క్వింటాళ్ల బియ్యం 18 బస్తాలు పాఠశాలకు సరఫరా చేశారన్నారు. హైస్కూలులో 6వ తరగతి గదిలో బియ్యాన్ని భద్రపరిచామన్నారు. 1వ తేదీ రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు బస్తాల బియ్యం చోరీ చేశారన్నారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశామని, పోలీసులు చర్యలు తీసుకోవాలని హెడ్మాస్టర్ విజ్ఞప్తి చేసింది.