4న సర్టిఫికెట్ల వెరిఫికేషన్ : డీపీవో
ABN , First Publish Date - 2020-11-03T10:41:40+05:30 IST
గ్రామ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 4వ తేదీ నిర్వహిస్తున్నట్లు డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు.
కడప (రూరల్), నవంబరు 2: గ్రామ సచివాలయాల డిజిటల్ అసిస్టెంట్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌ను ఈనెల 4వ తేదీ నిర్వహిస్తున్నట్లు డీపీవో ప్రభాకర్‌రెడ్డి తెలిపారు. జడ్పీ ఆవరణలోని డీపీఆర్‌సీ భవనంలో ఉదయం 10 గంటల నుంచి వెరిఫికేషన్ కార్యక్రమం ఉంటుందని, పంచాయతీరాజ్, విద్యా, రెవెన్యూ, సోషల్ వెల్ఫేర్ శాఖల నుంచి సంబంధిత అఽధికారుల కమిటీ సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేసి అర్హులను గుర్తిస్తారన్నారు. జిల్లాలోని 21 డిజిటల్ పోస్టులకు గాను 1:2 నిష్పత్తిన అభ్యర్థులను ఎంపిక చేసి ఇంటర్యూలకు హాజరుకావాలని కాల్ లెటర్లు పంపామన్నారు. ఈ మేరకు కాల్ లెటర్లు పొందిన వారు విద్యార్హత సర్టిఫికెట్లతో వెరిఫికేషన్‌కు హాజరుకావాలని సూచించారు.