ఏపీపీఆర్‌ఎంఈఏ జిల్లా అధ్యక్షుడిగా మల్లేశ్వరరెడ్డి

ABN , First Publish Date - 2020-10-31T07:30:47+05:30 IST

అంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కడప ఈఈ పీఆర్‌ఐ డివిజన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లంకా మల్లేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు.

ఏపీపీఆర్‌ఎంఈఏ జిల్లా అధ్యక్షుడిగా మల్లేశ్వరరెడ్డి

కడప(రూరల్‌), అక్టోబరు 30: అంధ్రప్రదేశ్‌ పంచాయతీరాజ్‌ మినిస్టీరియల్‌ ఎంప్లాయీస్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కడప ఈఈ పీఆర్‌ఐ డివిజన్‌లో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న లంకా మల్లేశ్వరరెడ్డి ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. అలాగే అసోసియేట్‌ ప్రెసిడెంట్‌గా కొండాపురం ఎంపీడీవో కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న పి.శ్రీనివాసులరెడ్డిని, ఉపాధ్యక్షుడిగా పుల్లంపేట, తొండూరు ఎంపీపీ కార్యాలయాలల్లో సీనియర్‌ అసిస్టెంట్లుగా పనిచేస్తున్న వై.శ్రీధర్‌, ఎన్‌.రమే్‌షబాబులను, జమ్మలమడుగు ఈఈ పీఆర్‌ఐలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న టి.గురుస్వామి, ప్రొద్దుటూరు ఈఈ పీఆర్‌ఐఎ్‌సడీలో రికార్డ్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.ఎం.విజయకుమార్‌లను ఎంపిక చేశారు.


అలాగే జనరల్‌ సెక్రటరీగా రాయచోటి ఈఈ పీఆర్‌ఐఎ్‌సడీలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.బసిరెడ్డిని, జాయింట్‌ సెక్రటరీలుగా బద్వేల్‌ ఎంపీపీ కార్యాలయంలో సీనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న డి.నరసయ్యను, ఎర్రగుంట్ల గర్ల్స్‌ జడ్పీహెచ్‌ఎ్‌సలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎం.నగే్‌షను, కమలాపురం ఎంపీపీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న ఎస్‌.రవికుమార్‌ను, రాజంపేట జడ్పీహెచ్‌ఎ్‌సలో రికార్డు అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.శ్రీనివాసులు ఎంపికయ్యారు. ట్రెజరర్‌గా రైల్వేకోడూరు ఎంపీపీ కార్యాలయంలో జూనియర్‌ అసిస్టెంట్‌గా పనిచేస్తున్న వి.మనోజ్‌కుమార్‌ను ఎంపిక చేశారు. వీరితో పాటు నలుగురు ఆర్గనైజింగ్‌ సెక్రటరీలు, జేసీపీ మెంబర్‌ను, నలుగురు స్టేట్‌ కౌన్సిలర్లు ఏకగ్రీవంగా ఎంపికైనట్లు లంకా మల్లేశ్వరరెడ్డి తెలిపారు. 

Read more