-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news
-
విస్తరించారు - తూము మరిచారు
ABN , First Publish Date - 2020-10-31T07:24:46+05:30 IST
పాయలకుంట్ల చెరు వు కట్టపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు.

చెరువు నిండా నీళ్లున్నా ఉపయోగం లేని వైనం
అధికారుల నిర్లక్ష్యమే : రైతులు
బి.కోడూరు, అక్టోబరు 30: పాయలకుంట్ల చెరు వు కట్టపై రోడ్డు విస్తరణ పనులు చేపట్టారు. అయితే చెరువు నిండితే పొలాలకు నీటిసరఫరా అయ్యేందుకు ఏర్పాటు చేసిన తూమును నిర్మిం చడం మరిచారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తో పాయలకుంట్ల చెరువు పూర్తిగా నిండింది. అయినా రైతులు పంటలకు వినియోగించుకో లేని దుస్థితిలో ఉంది. వివరాల్లోకెళితే,..
రాష్ట్రంలోని అన్ని మండల కేంద్రాలకు మెయిన్‌రోడ్డు నుంచి మండల కేంద్రానికి వెళ్లేందుకు రో డ్డు విస్తరణ చేపట్టారు. ఇందులో భాగంగా బి.కోడూరు మండల కేంద్రానికి బద్వేలు, పోరుమామిళ్ల మెయిన్ రోడ్డు ఎర్రివోబన్నబావి వద్ద నుం చి బి.కోడూరుకు ఆర్‌అండ్‌బీ అధికారులు రోడ్డు విస్తరణ చేపట్టారు. అయితే ఆ రోడ్డు పాయలకుంట్ల చెరువు కట్టపై నుంచి వెళ్లడంతో రోడ్డు విస్తరణలో భాగంగా చెరువుకున్న తూము తొలగించారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు చెరువు కు నీరు రాకపోవడంతో అధికారులకు చెరువుకు న్న తూము గుర్తుకు రాలే దు.
ప్రస్తుతం వర్షాలు బా గా కురుస్తుండడంతో పోరుమామిళ్ల చెరువు నుంచి గుండంరాజుపల్లె బ్రాంచ్ కెనాల్ ద్వారా నీళ్లు విడుదల చేయడంతో పాయలకుంట్ల చెరు వు పూర్తిగా నిండి అలుగు పొర్లిపారుతోంది. ఎ న్నో ఏళ్ల తరువాత చెరువు నిండడంతో రైతులు సంతోషంగా వరినార్లు పోసుకుని వరిని నాటుకుందామనుకుని చెరువు వద్దకు వచ్చి చూడగా తూము లేకపోవడంతో రైతులు లబోదిబోమం టూ ఎవరికి చెప్పుకోవాలో అర్ధం కాని పరిస్థితు ల్లో ఉన్నారు. చెరువు కింద 80 ఎకరాలు ఆయకట్టు, చెరువు చుట్టూ వంద ఎకరాల పొలానికి మేలు జరుగుతుంది. చెరువు నిండా నీరున్నా అవి పారగట్టుకునేందుకు తూము లేక రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికైనా ఇరిగేషన్ అధికారు లు చర్యలు తీసుకుని పొలాలకు నీరు పరగట్టు కునేందుకు ఏర్పాటు చేయాలని రైతులు వాపోతున్నారు.
ఈ విషయమై ఇరిగేషన్ ఏఈ నవీన్‌ను ‘ఆంధ్రజ్యోతి’ వివరణ కోరగా, రోడ్డు విస్తరణలో భాగంగా తొలగించిన చెరువు తూమును ఆర్‌అండ్‌బీ అధికారులే నిర్మించాలన్నారు. అయి తే వారు ఆ పని చేయలేదు. వారు తూముకు బదులు పైపులు వేసి సరిపెట్టుకున్నారు. ఇరిగేషన్‌లో తూమును త్వరగా ఏర్పాటు చేసి రైతులకు నీళ్లు అందించేందుకు శాయశక్తులా కృషి చేస్తామని తెలిపారు.