ఇసుక లేకపోతే ఇళ్లు ఎలా కట్టుకోవాలి

ABN , First Publish Date - 2020-10-13T11:41:07+05:30 IST

ఉచితంగా ఇస్తామన్న ఇసుక ఇవ్వ లేదు, ఇప్పటికిప్పుడు రూ.22వేలు పెట్టి ఆన్‌లైన్‌లో ఇసుకను కొనా లంటే సాధ్యమేనా? అని సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆమేరకు కొండాపురం తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి సోమవా రం వినతి పత్రాన్ని అందజేశారు.

ఇసుక లేకపోతే ఇళ్లు ఎలా కట్టుకోవాలి

కొండాపురం, అక్టోబరు 12: ఉచితంగా ఇస్తామన్న ఇసుక ఇవ్వ లేదు, ఇప్పటికిప్పుడు రూ.22వేలు పెట్టి ఆన్‌లైన్‌లో ఇసుకను కొనా లంటే సాధ్యమేనా? అని  సీపీఐ నాయకులు పేర్కొన్నారు. ఆమేరకు  కొండాపురం తహసీల్దార్‌ చంద్రశేఖర్‌రెడ్డికి సోమవా రం వినతి పత్రాన్ని అందజేశారు. పక్కనే రెండు నదులు ఉన్నా ఇసుకను ఇవ్వకుండా వేరే ప్రాంతాలకు తరలిస్తున్నారని సీపీఐ మండల కార్యదర్శి మనోహర్‌బాబు మండిపడ్డారు. ఇసుక లేక పోవడం వల్ల పునరావాస కేంద్రాలలో నిర్మించుకుంటున్న నిర్వా సితుల ఇళ్లు ఆగి పోయాయన్నారు.


ఉచిత ఇసుకను ప్రభుత్వం ఇవ్వకుండా ఆన్‌ లైన్‌లో రూ.22వేలు పెట్టి ఇసుకను కొంటే ప్రభుత్వం ఇచ్చే పరిహా రంలో సగభాగం ఇంటికే సరిపోతుం దన్నారు. వెంటనే నిర్వాసితులకు ఉచితంగా ఇసుకను సరఫరా చేయాలని  డిమాండ్‌ చేశారు.  కార్యక్రమంలో భవన నిర్మాణ కార్మిక సంఘం మండల అధ్యక్షుడు వెంకటరమణ, భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 

Updated Date - 2020-10-13T11:41:07+05:30 IST