ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఖాసింసాహెబ్‌

ABN , First Publish Date - 2020-10-13T11:38:48+05:30 IST

జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఎం.ఖాసింసాహెబ్‌ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు.

ఏఎస్పీగా బాధ్యతలు చేపట్టిన ఖాసింసాహెబ్‌

కడప (క్రైం), అక్టోబరు 12 : జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)గా ఎం.ఖాసింసాహెబ్‌ సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఖాసింసాహెబ్‌ స్వస్థలం కర్నూలు జిల్లా దేవనకొండ మండలం కరివేముల గ్రామం. ఈయన 1989 బ్యాచ్‌లో ఎస్‌ఐగా ఎంపికయ్యారు.


శిక్షణ కాలంలో రాష్ట్రంలోనే టాపర్‌గా నిలిచి ఉన్నతాధికారుల ప్రశంసలందుకున్నారు. అనంతరం ఎస్‌ఐగా, సీఐగా అనంతపురం జిల్లాలో విధులు నిర్వర్తించారు. డీఎస్పీగా పీటీసీ అనంతపురం, ఒంగోలు పీటీసీలలో పనిచేశారు. గుంతకల్లు డీఎస్పీగా విధులు నిర్వహిస్తూ పదోన్నతిపై కడప జిల్లా అదనపు ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు.

Updated Date - 2020-10-13T11:38:48+05:30 IST