పేద విద్యార్థుల ఉన్నత చదువే ప్రభుత్వ లక్ష్యం

ABN , First Publish Date - 2020-10-12T06:37:14+05:30 IST

పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. కడప నగరం వైఎ్‌సఆర్‌ ఆడి టోరియంలో ఆదివారం సమగ్ర శిక్ష సహకారంతో మదరసాలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు.

పేద విద్యార్థుల ఉన్నత చదువే ప్రభుత్వ లక్ష్యం

 డి ప్యూటీ సీఎం అంజద్‌బాషా

కడప (ఎడ్యుకేషన్‌), అక్టోబరు 11: పేద విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఉప ముఖ్యమంత్రి ఎస్‌బీ అంజద్‌బాషా పేర్కొన్నారు. కడప నగరం వైఎ్‌సఆర్‌ ఆడి టోరియంలో ఆదివారం సమగ్ర శిక్ష సహకారంతో మదరసాలో చదువుతున్న విద్యార్థులకు జగనన్న విద్యాకానుక కిట్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ  జగనన్న విద్యాకానుక ద్వారా మూడు జతల బట్టలు, పాఠ్య పుస్తకాలు, నోట్‌బుక్స్‌, ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, బ్యాగు, బెల్టు, మూడు జతల యూనిఫాం్స ఇవ్వడం జరుగుతుందన్నారు. జిల్లాలో 20 మదరసాల్లో ఉన్న 1150 మంది విద్యార్థులకు కిటు ్లపంపిణీ చేశామన్నారు.


డీఈవో శైలజ, సర్వశిక్ష జిల్లా పాజ్రెక్టు అధికారి ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ  కొత్తగా ప్రభుత్వ పాఠశాలల్లో ఎన్‌రోల్‌మెంటు అయ్యే విద్యార్థుల కొరకు జిల్లా వ్యాప్తంగా 20 శాతం అదనంగా జగనన్న విద్యాకానుక కిట్లు నిల్వ ఉం చామన్నారు. నవంబరు 2 నుంచి పాఠశాలలు పార్రంభించడం జరుగుతుందని, విద్యార్థులందరూ కోవిడ్‌ నిబంధనలు పాటిస్తూ తరగతులకు వెళ్లాలని విద్యార్థులతో ప్రతిజ్ఞ చేయించారు.  కార్యక్రమంలో ఎంఈవో నారాయణ, వైసీపీ నాయకులు సూర్యనారాయణ, సుభాన్‌బాషా, మదరసాల సంఘం అధ్యక్షులు గౌస్‌, ఎఎంవో ధనలక్ష్మి, ఎఎంవో ఉర్దు ఇలియా్‌సతో పాటు పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-10-12T06:37:14+05:30 IST