-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news
-
వక్ఫ్ ఆస్తులు కాపాడాలి : డిప్యూటీ సీఎం
ABN , First Publish Date - 2020-10-07T07:13:46+05:30 IST
రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బి అంజద్‌బాషా అధికారులకు ఆదేశించారు.

కడప (ఎడ్యుకేషన్), అక్టోబరు 6: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న వక్ఫ్‌బోర్డు ఆస్తులను కాపాడాలని ఉప ముఖ్యమంత్రి, మైనార్టీ సంక్షేమశాఖ మంత్రి ఎస్‌బి అంజద్‌బాషా అధికారులకు ఆదేశించారు. విజయవాడలోని వెలగపూడి నుంచి మంగళవారం ఆయా జిల్లా ల్లో ఉన్న వక్ఫ్‌బోర్డు ఆస్తులపై జిల్లా రెవెన్యూ అధికారులు, మైనార్టీ సంక్షేమశాఖాధికారులు, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెవెన్యూ డివిజనల్ అధికారులు మైనార్టీ సంక్షేమశాఖాధికారులు, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్లు బాధ్యత వహించి వక్ఫ్‌బోర్డు ఆస్తులు కాపాడాలన్నారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమశాఖాధికారి మస్తాన్‌వలి, వక్ఫ్‌బోర్డు ఇన్‌స్పెక్టర్ ముక్తియార్, మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ ఈడీ బ్రహ్మయ్య పాల్గొన్నారు.