-
-
Home » Andhra Pradesh » Kadapa » kadapa news
-
మెడికల్ కళాశాలకు 51.2 ఎకరాలు కేటాయింపు
ABN , First Publish Date - 2020-10-07T07:06:06+05:30 IST
పులివెందులలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు అధికారులు 51.2 ఎకరాలు కేటాయించారు.

పులివెందుల టౌన్, అక్టోబరు 6: పులివెందులలో ఏర్పాటు చేయనున్న మెడికల్ కళాశాలకు అధికారులు 51.2 ఎకరాలు కేటాయించారు. పట్టణంలోని కడప-పులివెందుల రోడ్డులో కె.వెలమవారిపల్లెలో స్థలాన్ని కేటాయించడంతో మంగళవారం అధికారులు అక్కడకు వెళ్లి స్థల హద్దులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఏపీఎంఐడీసీ (ఆంధ్రప్రదేశ్ మెడికల్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ అథారిటీ) డీఈ శివరామిరెడ్డికి తహసీల్దార్ మాధవకృష్ణారెడ్డి హద్దులను చూపించి సిబ్బందితో సర్వే చేయించారు. ఈ కార్యక్రమంలో మండల సర్వేయర్ సందీప్‌రెడ్డి, మున్సిపల్ టౌన్ సర్వేయర్ వాసు, రెవిన్యూ సిబ్బంది పాల్గొన్నారు.