భక్తులతో కిటకిటలాడిన గండి

ABN , First Publish Date - 2020-10-04T06:01:05+05:30 IST

గండి వీరాంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పాపాఘ్ని నది పారుతుండడంతో శ్రావణ మాసోత్సవాలను మరపించే విధంగా భక్తులు భారీగా వచ్చారు.

భక్తులతో కిటకిటలాడిన గండి

చక్రాయపేట, అక్టోబరు 3: గండి వీరాంజనేయస్వామి ఆలయం శనివారం భక్తులతో కిటకిటలాడింది. పాపాఘ్ని నది పారుతుండడంతో శ్రావణ మాసోత్సవాలను మరపించే విధంగా భక్తులు భారీగా వచ్చారు. స్పెషల్‌ దర్శనం, సర్వదర్శనం, వాహన టికెట్లు, లడ్డూ ప్రసాదాలు, తలనీలాలు, కొబ్బరికాయలు, వసతిగృహాలకు దాదాపు రూ.3.50 లక్షల ఆదాయం వచ్చినట్లు తెలిసింది. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జిల్లా సహాయ కమిషనర్‌ శంకరబాలాజి అన్ని ఏర్పాట్లు చేశారు.


పాపాఘ్ని నదిలో ఎలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు బందోబస్తు నిర్వహించారు. ఉదయం 7 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు భక్తులు కిక్కిరిసిపోయారు. అర్చకుడు రఘుస్వామి ఆధ్వర్యంలో అభిషేకాలు చేసి మూలవిరాట్‌ను పూలమాలలతో అలంకరించారు. కరోనా వైరస్‌ కారణంగా ఎలాంటి సంఘటనలు జరగకుండా మాస్కులు వేసుకోవడం, భౌతిక దూరం పాటించడం లాంటివి దేవస్థానం చేపట్టింది. 

Updated Date - 2020-10-04T06:01:05+05:30 IST