ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య మైనింగ్ వార్

ABN , First Publish Date - 2020-12-29T19:31:11+05:30 IST

జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి మైనింగ్ వార్ నడుస్తోంది.

ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, రామసుబ్బారెడ్డి మధ్య మైనింగ్ వార్

కడప: జమ్మలమడుగు ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి, మాజీ మంత్రి, వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి మైనింగ్ వార్ నడుస్తోంది. ముద్దనూరు మండలం చింతకుంట గ్రామం దగ్గర మైనింగ్ కోసం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమంలో జమ్మలమడుగు ఎమ్మెల్యే  సుధీర్ రెడ్డి  పాల్గొన్నారు. ఈ సందర్భంగా మైనింగ్ కోసం ప్రయత్నిస్తున్న మాజీ మంత్రి,  వైసీపీ నేత రామ సుబ్బారెడ్డి తనయుడు శివారెడ్డి మైనింగ్ చేయడాన్ని ఎటువంటి పరిస్థితుల్లో ఒప్పుకోను అని స్పష్టం చేశారు. ప్రాణాలు అడ్డుపెట్టి అయినా మైనింగ్ జరగనివ్వమని స్పష్టం చేశారు. వైసీపీ మైనింగ్‌కు  వ్యతిరేకమని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి తెలిపారు. 

Updated Date - 2020-12-29T19:31:11+05:30 IST