కడపలో నివాసాలు కూల్చివేత...వివాదం
ABN , First Publish Date - 2020-12-11T16:52:00+05:30 IST
నగరంలో రోడ్ల వెడల్పులో భాగంగా శుక్రవారం ఉదయం నివాసాలు, దుకాణాల గదుల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది.
కడప: నగరంలో రోడ్ల వెడల్పులో భాగంగా శుక్రవారం ఉదయం నివాసాలు, దుకాణాల గదుల కూల్చివేత ఉద్రిక్తతకు దారి తీసింది. కూల్చివేతను బాధితులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో అధికారులు, బాధితుల మధ్య వివాదం చోటు చేసుకుంది. నష్ట పరిహారం చెల్లించకుండా నివాసాలు, దుకాణాల కూల్చివేతపై బాధితులు మండిపడుతున్నారు.