కడపలో అఖిలపక్షం భారీ ర్యాలీ

ABN , First Publish Date - 2020-12-07T18:20:49+05:30 IST

నగరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వరకు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు.

కడపలో అఖిలపక్షం భారీ ర్యాలీ

కడప: నగరంలో అఖిలపక్షం ఆధ్వర్యంలో ఛలో కలెక్టరేట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా కలెక్టరేట్ వరకు నేతలు భారీ ర్యాలీ నిర్వహించారు. నగరంలో బుగ్గవంక వరద బాధితులను అన్ని విధాల ఆదుకోవాలని.. ఆ కుటుంబాలకు రూ.25 వేల చొప్పున పరిహారం అందించాలని డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. టీడీపీ, సీపీఐ, సీపీఎం ప్రజా సంఘాల నాయకులు ర్యాలీలో పాల్గొన్నారు. దీంతో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. 

Updated Date - 2020-12-07T18:20:49+05:30 IST