చెట్టును ఢీకొన్న కారు..ఐదుగురికి గాయాలు
ABN , First Publish Date - 2020-11-13T16:27:15+05:30 IST
జిల్లాలోని రైల్వేకొడూరు మండలం ఉప్పరల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది.
కడప: జిల్లాలోని రైల్వేకొడూరు మండలం ఉప్పరల్లి వద్ద శుక్రవారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ కారు.. లారీని తప్పించబోయి అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కారులోని ఐదుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని క్షతగాత్రులను తిరుపతి రుయా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.