కడపలో వ్యక్తి దారుణ హత్య

ABN , First Publish Date - 2020-10-31T15:19:50+05:30 IST

జిల్లాలోని రాయచోటి రాజులకాలనీలో రాజేంద్రమురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు.

కడపలో వ్యక్తి దారుణ హత్య

కడప: జిల్లాలోని రాయచోటి రాజులకాలనీలో  రాజేంద్రమురళి అనే వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. మిద్దెపై నిద్రిస్తుండగా... మృతుని తమ్ముడే అన్నపై బండ రాయి మీద వేసి చంపినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అన్నదమ్ములు ఇరువురిది తమిళాడు ధర్మపురి జిల్లాగా తెలుస్తోంది. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నా పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. 

Read more