సమస్యల పరిష్కారంలో కాలయాపన
ABN , First Publish Date - 2020-12-16T04:47:46+05:30 IST
కార్మిక సమస్యల పరిష్కారంలో ఏపీఎండీసీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి ఆరోపించారు.
ఓబులవారిపల్లె, డిసెంబరు15 : కార్మిక సమస్యల పరిష్కారంలో ఏపీఎండీసీ యాజమాన్యం కాలయాపన చేస్తోందని ఏపీఎండీసీ ఎంప్లాయీస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోకూరి మురళి ఆరోపించారు. అనేక సమస్యలపై పలుదఫాలుగా చేసిన పోరాటాల ఫలితంగా యాజమాన్యం స్పందించి రాతమూలక హామీ ఇచ్చిందన్నారు. అయితే హామీలు ఇంత వరకు అమలు చేయలేదని వాపోయారు. ఇచ్చిన హామీలపై ఎండీని కలిసి చర్చిస్తామంటే కింది స్థాయి అధికారులు అనుమతి ఇవ్వలేదని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘ నాయకులు ఈశ్వరయ్య, నాగార్జున, ఆర్.వెంకటేష్, జి.దినేష్, బి.హరి, ఎస్.మునిశేఖర్ పాల్గొన్నారు.