సీఎం పర్యటన ఏర్పాట్లలో జేసీలు
ABN , First Publish Date - 2020-12-21T04:30:53+05:30 IST
ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహనరెడ్డి పులివెందుల, చక్రాయపేట పర్యటన నేపథ్యంలో జా యింట్ కలెక్టర్ గౌతమి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత వ ర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్ ఏర్పాట్లను ప రిశీలించారు.

పులివెందుల టౌన, డిసెంబరు 20: ముఖ్యమంత్రి వైఎస్ జగన మోహనరెడ్డి పులివెందుల, చక్రాయపేట పర్యటన నేపథ్యంలో జా యింట్ కలెక్టర్ గౌతమి, జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత వ ర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ, పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్ ఏర్పాట్లను ప రిశీలించారు. పాడా ఓఎస్డీ అనిల్‌కుమార్‌రెడ్డితో కలిసి పులివెందులలో నిర్మిస్తున్న ఆర్టీసీ బస్టాండ్, అపాచి లెదర్ ఫ్యాక్టరీ స్థలాలను జేసీ గౌత మి పరిశీలించారు.
కాన్వాయ్ రూట్, వీఐపీ, పబ్లిక్ రూట్ ఎలా ఏర్పా టుచేయాలో సూచించారు. ముఖ్యమంత్రి ప్రారంభించే శిలాఫలకాలు, సభాస్థలం, ఏర్పాట్ల గురించి అడిగి తెలుసుకున్నారు. నీటిపారుదల శాఖ ఎస్‌ఈ రాజశేఖర్, ఆర్డీఓ నాగన్న, డ్వామా పీడీ యదుభూష ణ్‌రెడ్డి, ఆర్‌అండ్‌బీ డీఈ శ్రీధర్‌రెడ్డి, తహసీల్దార్ మాధవ కృష్ణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ నరసింహారెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
చక్రాయపేట, డిసెంబరు 20: చక్రాయపేట మండలం మారెళ్లమ డకకు రానున్న సందర్భంగా అక్కడ జరిగే ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ (అభివృద్ధి) సాయికాంత వర్మ, సబ్ కలెక్టర్ పృథ్వితేజ పర్యవే క్షించారు. సభా ప్రాంగణలో బారికేడ్లు పరిశీలించారు. సచివాలయం, రైతు భరోసా, ఆరోగ్యకేంద్రం పనులను పరిశీలించి సూచనలు, సలహా లు ఇచ్చారు. డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ రవీంద్రరెడ్డి, ఎస్‌ఐలు కృష్ణ మూర్తి, రఘురామ్ హెలీప్యాడ్‌కు అనువైన ప్రాంతాన్ని పరిశీలించారు.