కడప సెంట్రల్‌ జైలుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

ABN , First Publish Date - 2020-06-23T11:15:05+05:30 IST

తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను సోమవారం మధ్యాహ్నం అనంతపురం పోలీసులు కడప కేంద్ర

కడప సెంట్రల్‌ జైలుకు జేసీ ప్రభాకర్‌రెడ్డి

కడప (క్రైం), జూన్‌ 22 : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి, ఆయన కుమారుడు అస్మిత్‌రెడ్డిలను సోమవారం మధ్యాహ్నం అనంతపురం పోలీసులు కడప కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు. జేసీ ట్రావెల్స్‌కు చెందిన లారీ, బస్సులకు సంబంధించి అనంతపురం జిల్లాలో తండ్రీకొడుకులపై కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు అనంతపురంలో కరోనా ఉన్న నేపధ్యంలో వారిని కడప సెంట్రల్‌ జైలుకు తరలించారు.


అనంతపురం కోర్టు ఆదేశాల మేరకు అనంతపురం వన్‌టౌన్‌ పోలీసులు రెండు రోజుల కస్టడీని కోరుతూ పిటీషన్‌ వేయడంతో కోర్టు ఆదేశాల మేరకు శనివారం వారిని కడప సెంట్రల్‌ జైలుకు వచ్చి రెండు రోజుల పాటు కస్టడీకి తీసుకుని అనంతపురం వెళ్లారు. ప్రభాకర్‌రెడ్డి, ఆయన తనయుడిని రెండు రోజుల పాటు విచారించిన అనంతరం పోలీసులకు ఇచ్చిన గడువు ముగియడంతో సోమవారం మధ్యాహ్నం వారిని కడప కేంద్ర కారాగారానికి తీసుకువచ్చారు. 

Read more