విద్యుత సంస్థల ప్రైవేటీకరణ వద్దు-జేఏసీ

ABN , First Publish Date - 2020-11-07T06:35:24+05:30 IST

రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న విద్యుత సంస్థలను ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవా లని విద్యుత ఉద్యోగుల జేఏసీ నేతలు హెచ్చరించారు.

విద్యుత సంస్థల ప్రైవేటీకరణ వద్దు-జేఏసీ

ఎర్రగుంట్ల, నవంబరు 6: రాష్ట్ర ప్రభుత్వ అధీనంలో నడుస్తున్న విద్యుత సంస్థలను ప్రైవేటు పరం చేసే కార్యక్రమాన్ని వెంటనే ఉపసంహరించుకోవా లని విద్యుత ఉద్యోగుల జేఏసీ నేతలు హెచ్చరించారు. గత 20రోజులుగా విద్యుత ఉద్యోగులు రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు చేస్తున్నా రాష్ట్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరించడం దారుణమని వారు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. న్యాయమైన డిమాండ్లను పరిష్కరిండంలో మొండివైఖరి ప్ర దర్శించడం వల్లే తాము ఆందోళన చేస్తున్నట్లు పేర్కొన్నారు. విద్యుత జేఏసీ ఆధ్వర్యంలో ఆర్టీపీపీలో శుక్రవారం భోజన విరామ సమయంలో వారు ప్లాంటు మెయినగేటు వద్ద పెద్దఎత్తున నిరసన వ్యక్తం చేశారు.  ఉద్యోగుల ను భయాందోళనకు గురిచేసే ఎలాంటి కుయుక్తులకు బెదరమన్నారు. విద్యు త రంగ పరిరక్షణ కోసం ఎలాంటి త్యాగాలకైనా సిద్ధంమన్నారు. 

Updated Date - 2020-11-07T06:35:24+05:30 IST