-
-
Home » Andhra Pradesh » Kadapa » Insurance claim for every sports person
-
ప్రతి క్రీడాకారుడికి ఇన్సూరెన్స్ చేయాలి
ABN , First Publish Date - 2020-12-31T05:15:51+05:30 IST
ప్రతి క్రీడాకారుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అంతర్జాతీయ హాకీ అంపైర్ అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి తెలిపారు.

అంతర్జాతీయ హాకీ అంపైర్ అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి
సీకేదిన్నె, డిసెంబరు 30: ప్రతి క్రీడాకారుడికి ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని అంతర్జాతీయ హాకీ అంపైర్ అన్నపురెడ్డి జనార్ధన్‌రెడ్డి తెలిపారు. మండలంలోని బయనపల్లె వెంకటేశ్వర ఉన్నత పాఠశాలకు బుధవారం వచ్చి ఆయన క్రీడాకారులతో ముచ్చటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్పోర్ ్ట్స కోటాలో ప్రభుత్వం రెండు శాతం రిజర్వేషన్ కల్పించిందని, ఈ అవకాశాన్ని క్రీడాకారులు సద్వినియోగం చేసుకుని ఉన్నత విద్యావకాశాలు పొందాలన్నారు. జిల్లాలో ఉన్న ఏకైక క్రీడా పాఠశాలను నాడు-నేడు పనుల కింద చేర్చి అభివృద్ధి చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు దీన్‌దయాల్, పీఈటీ పవన్‌కుమార్, హాకీ విద్యార్థులు పాల్గొన్నారు.