పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

ABN , First Publish Date - 2020-12-29T05:07:35+05:30 IST

సీపీఎస్‌ విధానాన్ని తొలగించి పాత పెన్షన్‌విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు.

పాత పెన్షన్‌ విధానాన్ని అమలు చేయాలి

రాజంపేట టౌన్‌, డిసెంబరు28 : సీపీఎస్‌ విధానాన్ని తొలగించి పాత పెన్షన్‌విధానాన్ని అమలు చేయాలని రాష్ట్ర ఎన్జీవో అధ్యక్షుడు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్‌ చేశారు. సోమవారం సాయంత్రం రాజంపేట ఎన్జీవో హోమ్‌లో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను రెగ్యులర్‌ చేయాలన్నారు.  

సచివాలయ ఉద్యోగి కుటుంబానికి ఆర్థిక సహాయం...

చిట్వేలి మండలంలోని సచివాలయ ఉద్యోగి మనోహర్‌ ఇటీవల మృతి చెందడంతో రాజంపేట, రైల్వేకోడూరు ఎన్జీవో సంఘాలు 35వేల రూపాయల నగదును వారి కుటుంబ సభ్యులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎన్జీవో సంఘ అధ్యక్షుడు శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి శ్రీనివాసులు, రాజంపేట ఎన్జీవో గౌరవాధ్యక్షుడు శివారెడ్డి, అధ్యక్షుడు రమణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా 2021 నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. 


Updated Date - 2020-12-29T05:07:35+05:30 IST