వైఎస్ వివేకాకు ఘన నివాళులు
ABN , First Publish Date - 2020-03-16T10:30:42+05:30 IST
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్దంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు.
నివాళులు అర్పించిన వైఎస్ కుటుంబ సభ్యులు
పులివెందుల టౌన్, మార్చి 15 : మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి ప్రథమ వర్దంతి సందర్భంగా వైఎస్ కుటుంబ సభ్యులు ఘన నివాళులు అర్పించారు. ఆదివారం పులివెందులలోని ఆయన సమాధి వద్ద వైసీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయలక్ష్మి, షర్మిల, వివేకా సతీమణి వైఎస్ సౌభాగ్యమ్మ, కుమార్తె సునీత, అల్లుడు రాజశేఖర్‌రెడ్డి, కడప ఎం పీ వైఎస్ అవినాష్‌రెడ్డి, వివేకా సోదరి విమలమ్మ, వైఎస్ భారతమ్మ, వైఎస్ సుధీకర్‌రెడ్డి సతీమణి జయమ్మ, రవీంద్రనాథరెడ్డి, వైఎస్ భాస్కర్‌రెడ్డి, వైఎస్ మనోహర్‌రెడ్డి, ఇసీ గంగిరెడ్డి, వైఎస్ ప్రతాప్‌రెడ్డి, నర్రెడ్డి శివప్రకాష్‌రెడ్డి, వైఎస్ కొండారెడ్డి, మైఖేల్ విజయ్‌కుమార్, థామస్‌రెడ్డి, క్రిస్టఫర్‌లు పూలమాల ఉంచి ఘన నివాళులు అర్పించారు. అనం తరం ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రత్యేక ప్రార్థన లు నిర్వహించారు. అనంతరం స్థానిక సీఎస్‌ఐ చర్చిలో ప్రార్థన కూటమి నిర్వహించగా వైఎస్ కుటుంబ సభ్యులందరు హాజరయ్యారు.
ఫాస్టర్లు బెనహర్‌బాబు, నరేష్‌కుమా ర్, మృత్యుంజయ, శిఖామణిల ఆధ్వర్యంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్ వివే కా సోద రి వైఎస్ విమలమ్మ మాట్లాడుతూ ఎలాంటి కష్టం వచ్చిన ఆయన వద్దకు వచ్చి చెప్పుకుంటే సమస్య పరిష్కరించేవారని గుర్తుకు చేసుకున్నారు. ఆయనతో ఉన్న సాన్నిహిత్యాన్ని గుర్తుకు తెచ్చుకొని కన్నీటి పర్యంతమయ్యారు. చిన్నాపెద్ద అనే తేడా లేకుండా అందరిని అప్యాయంగా పలుకరించే వారన్నారు. వైఎస్ వివేకాకు పీసీసీ వర్కింగ్ ప్రె సిడెంట్ తులసిరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రామచంద్రయ్య, ప్రొ ద్దుటూరు మాజీ ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిలు ఘన నివాళులు అర్పించారు. వివేకా వర్దంతి సందర్భంగా ఆయన స్మారకార్థం క్రికెట్, కబడ్డీ, షటిల్, బాల్‌బ్యాడ్మింటన్ పోటీ లు నిర్వహించారు. విజేతలకు వైఎస్ షర్మిల, వైఎస్ వివేకా సోదరి విమలమ్మ, పారిశ్రామిక వేత్త వైఎస్ ప్రకాష్‌రెడ్డిలు బహుమతులను ప్రధానం చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు, అభిమానులు ఘన నివాళులు అర్పించారు.