ఆ 227 ఎకరాల్లో ఇళ్ల పట్టాలివ్వొద్దు: హైకోర్టు

ABN , First Publish Date - 2020-12-25T05:35:06+05:30 IST

పులివెందుల మున్సిపాలిటీ పరిఽఽధిలోని గుండ్లమడుగు గ్రామంలో ఏపీఐఐసీకి చెందిన 227 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు గురువారం మఽధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది.

ఆ 227 ఎకరాల్లో ఇళ్ల పట్టాలివ్వొద్దు: హైకోర్టు

ఏపీఐఐసీ భూములపై మధ్యంతర ఉత్తర్వులు

తదుపరి విచారణ జనవరి 21కి వాయిదా

అమరావతి, డిసెంబరు 24(ఆంధ్రజ్యోతి): పులివెందుల మున్సిపాలిటీ పరిఽఽధిలోని గుండ్లమడుగు గ్రామంలో ఏపీఐఐసీకి చెందిన 227 ఎకరాల్లో ఇళ్లపట్టాలు ఇవ్వడాన్ని నిలుపుదల చేస్తూ హైకోర్టు గురువారం మఽధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తదుపరి విచారణను జనవరి 21కి వాయిదా వేస్తూ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ జేకే మహేశ్వరి, జస్టిస్‌ జె.ఉమాదేవితో కూడిన ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది.

ఇళ్ల పట్టాలు పంపిణీ చేసేందుకు గుండ్లమడుగులో ఏపీఐఐసీకి చెందిన 227 ఎకరాలను వెనక్కి తీసుకుంటూ ఫిబ్రవరి 16న కలెక్టర్‌ ఇచ్చిన ఉత్తర్వులను సవాలు చేస్తూ వ్యవసాయ కూలి జి.అంకల్‌ రెడ్డి హైకోర్టును ఆశ్రయించారు. పిటిషనర్‌ తరఫు న్యాయవాది పి.నాగేందర్‌ రెడ్డి వాదనలు వినిపిస్తూ... పారిశ్రామికవాడ అభివృద్ధి కోసం ఏపీఐఐసీకి ఇచ్చిన భూమిని వెనక్కి తీసుకునే అధికారం కలెక్టర్‌కు లేదన్నారు. ప్రభుత్వం తరఫున అడ్వకేట్‌ జనరల్‌ వాదనలు వినిపిస్తూ.. వ్యాజ్యం దాఖలు చేయడం వెనుక ప్రజాహితం లేదన్నారు. ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు కేటాయించిన భూమి నిరుపయోగంగా పడిఉంటే వెనక్కి తీసుకొనే అధికారం ప్రభుత్వానికి ఉందని ఏజీ పేర్కొన్నారు.


లేఅవుట్‌ను పరిశీలించిన సీఎం

పులివెందుల టౌన, డిసెంబరు 24: పట్టణంలోని జేఎన్టీయూ వెనుక వైపున ఏపీఐఐసీ స్థలంలోని జగనన్న ఇళ్ల లేఅవుట్‌ను ముఖ్యమంత్రి వైఎస్‌ జగనమోహనరెడ్డి గురువారం పరిశీలించారు. హౌసింగ్‌ లేఅవుట్లలో ఏర్పాటుచేసిన హెలీ ప్యాడ్‌ వద్దకు చేరుకున్న ముఖ్యమంత్రి అక్కడి ఇళ్ల స్థలాలను పరిశీలించారు. ఇక్కడ లబ్ధిదారులకు ఉండే వసతులపై కలెక్టర్‌ హరికిరణ్‌, ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, జేసీ గౌతమితో సీఎం చర్చించారు.

Updated Date - 2020-12-25T05:35:06+05:30 IST