లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సిద్ధం

ABN , First Publish Date - 2020-12-20T05:20:43+05:30 IST

మండలంలోని పలు గ్రామాల్లోని మొత్తం 675 మంది పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్లస్థలాలు సిద్ధంగా ఉన్నట్లు స్పెషల్‌కలెక్టర్‌ సతీష్‌ చంద్ర పేర్కొన్నారు.

లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు సిద్ధం
ఇళ్లస్థలాల వద్ద జాబితాను పరిశీలిస్తున్న స్పెషల్‌ కలెక్టర్‌ సతీష్‌చంద్ర

చాపాడు, డిసెంబరు 19: మండలంలోని పలు గ్రామాల్లోని మొత్తం 675 మంది పేదలకు పంపిణీ చేసేందుకు ఇళ్లస్థలాలు సిద్ధంగా ఉన్నట్లు స్పెషల్‌కలెక్టర్‌ సతీష్‌ చంద్ర పేర్కొన్నారు. చాపాడు, నక్కలదిన్నె గ్రామాల్లో ఉన్న స్థలాలను శనివారం ఆయ న పరిశీలించారు. దరఖాస్తు చేసుకున్న పేదలందరికీ ఇళ్లస్థలాలు ఈనెల 25 నుంచి జనవరి 6వ తేదీ వరకు తేదీల వారీగా అందజేస్తారన్నారు. ఇంకా 136 మంది పేదల కు కూడా ఇళ్లస్థలాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. తహసీల్దారు శ్రీహరిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట ఆర్‌ఐ సుబ్బారావు, వీఆర్వోలు శ్రీనివాసుల రెడ్డి, రాజశేఖర్‌రెడ్డి, సర్వేయర్‌ ఉన్నారు.

Updated Date - 2020-12-20T05:20:43+05:30 IST