ఇళ్ల పంపిణీలో దిగొచ్చిన జగన్‌ సర్కారు

ABN , First Publish Date - 2020-11-22T05:00:27+05:30 IST

టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ జరిపిన పోరాటాలతో జగన్‌ సర్కారు దిగొచ్చిందని కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు అన్నారు.

ఇళ్ల పంపిణీలో దిగొచ్చిన జగన్‌ సర్కారు
మాట్లాడుతున్న అమీర్‌బాబు

కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు

కడప, నవంబరు 21 (ఆంధ్రజ్యోతి): టిడ్కో ఇళ్ల పంపిణీ విషయంలో టీడీపీ జరిపిన పోరాటాలతో జగన్‌ సర్కారు దిగొచ్చిందని కడప అసెంబ్లీ టీడీపీ ఇన్‌చార్జ్‌ వీఎస్‌ అమీర్‌బాబు అన్నారు. శనివారం ఆయన తన నివాసంలో విలేకరులతో మాట్లాడు తూ టీడీపీ చేపట్టిన ‘నా ఇల్లు - నా సొంతం’ కార్యక్రమానికి ప్ర జల నుంచి పెద్ద ఎత్తున స్పందన రావడంతో వైసీపీ ప్రభుత్వం వెనక్కు తగ్గిందన్నారు. పోరాటాలే ఊపిరిగా పుట్టిన పార్టీ టీడీపీ అని, అధికారంలో ఉన్నా ప్రతిపక్షంలో ఉన్నా ప్రజలతోనే ఉం టుందన్నారు. మార్చి 25న పంపిణీ చేయాల్సిన ఇళ్ల పట్టాలను డిసెంబరు 25న ఎలా ఇస్తారని ధ్వజమెత్తారు. టీడీపీ నేతలు కోర్టుల్లో కేసులు వేయ డం వల్లే ఇళ్ల పట్టాలు ఇవ్వలేకున్నామని జగన్‌ అండ్‌ కో ప్రచారం చేసిందని, ఇప్పుడు ఆ కేసులు ఏమయ్యాయో తెలపాలని ప్రశ్నించారు. పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో వైసీపీ నేతలు చేసిన భూకుంభకోణాలకు సమాధానం చెప్పాలన్నారు. రివర్స్‌ టెండరింగ్‌ ద్వారా వందల కోట్ల రూపాయలు ఆదా చేస్తున్నామని ప్రచారం చేస్తున్న వైసీపీ ఇళ్ల పట్టాల కోసం సేకరించిన భూమిపై రివర్స్‌ నోటిఫికేషన్‌కు ఎందుకు వెళ్లలేదని ప్రశ్నించారు. ముంపు ప్రాంతాల్లో ఇళ్ల పట్టాల పంపిణీ నిలిపివేయాలన్నారు. మాజీ జీపీ గురప్ప, బీసీ సెల్‌ జిల్లా కార్యదర్శి మాసా కోదండరామ్‌ తదితరులు పాల్గొన్నారు.


Read more