-
-
Home » Andhra Pradesh » Kadapa » house sites for poor
-
పేదలందరికీ ఇళ్లు సీఎం లక్ష్యం: ఎమ్మెల్యే
ABN , First Publish Date - 2020-12-29T05:09:31+05:30 IST
పేదలందరికీ ఇళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అన్నారు.

పోరుమామిళ్ల, డిసెంబరు 28: పేదలందరికీ ఇళ్లు సీఎం జగన్‌మోహన్‌రెడ్డి లక్ష్యమని బద్వేలు ఎమ్మెల్యే వెంకటసుబ్బయ్య అన్నారు. సోమవారం రం గసముద్రం పంచాయతీ పరిధిలోని 913 సర్వే నెంబరులో పోరుమామిళ్ల, రంగసముద్రం పంచాయతీలకు చెందిన పేదలకు ఇళ్లపట్టాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోరుమామిళ్లలో 441 మందికి ఇళ్లపట్టాలు, 417 మందికి పక్కాగృహాలు మంజూరయ్యాయన్నారు. స్పెషల్ ఆఫీసరు పద్మజ, మాజీ ఎంపీపీ చిత్తా విజయప్రతా్‌పరెడ్డి, బద్వేలు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు.