ఇంటి పట్టాల పంపిణీ నిరంతర ప్రక్రియ
ABN , First Publish Date - 2020-12-31T05:16:03+05:30 IST
ఇంటి పట్టాల కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని, ఇంటి ప్లాట్ల వద్ద త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు వేగవంతంగా తీసుకుంటామని కలెక్టర్ హరికిరణ్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు.
కలెక్టర్ హరికిరణ్, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు
రైల్వేకోడూరు, డిసెంబరు, 30: ఇంటి పట్టాల కార్యక్రమం నిరంతరాయంగా జరుగుతుందని, ఇంటి ప్లాట్ల వద్ద త్వరితగతిన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు చర్యలు వేగవంతంగా తీసుకుంటామని కలెక్టర్ హరికిరణ్, రైల్వేకోడూరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ కొరముట్ల శ్రీనివాసులు తెలిపారు. బుధవారం రైల్వేకోడూరు మండలంలోని ఉర్లగట్టుపోడులో ఇంటి పట్టాల పంపిణీ కార్యక్రమానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో లక్ష మందికి పైగా ఇళ్ల పట్టాలు ఇవ్వడం జరుగుతుందని, ఇందుకు 300 కోట్లు ఖర్చు పెట్టినట్లు వివరించారు.
ఇంటి పట్టాలు ఇచ్చిన చోట తాగునీరు, విద్యుత్, స్కూలు, సచివాలయం, విలేజ్ క్లీనిక్ ఏర్పాటు చేస్తామని తెలిపారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పేదలందరికి సొంతింటి కల నెరవేర్చడానికి కంకణం కట్టుకుని ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఇంటి పట్టాల కార్యక్రమాన్ని చేపట్టారని తెలిపారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ కేతన్‌కార్గ్, జిల్లా హౌసింగ్ ప్రాజెక్టు అధికారి రాజశేఖర్, తహసీల్దార్ శిరీషా, ఎంపీడీవో పఠాన్ మహబూబ్‌ఖాన్, హౌసింగ్ డీఈ కుప్పుస్వామి, ఏఈ మురళీక్రిష్ణ, ఉప తహసీల్దార్ శివరాం, ఆర్‌ఐలు సుశీల్‌కుమార్, పగడాల ఫణిక్రిష్ణ, ఎన్నికల డిప్యూటీ తహసీల్దార్ మురళీక్రిష్ణ, వైసీపీ సీనియర్ నేత రామిరెడ్డి ధ్వజారెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు గుంటిమడుగు సుధాకర్‌రాజు, పట్టణ అధ్యక్షుడు సీహెచ్ రమే్‌షబాబు, కాపు కార్పొరేషన్ డైరెక్టర్ మందల నాగేంద్ర, యువ నాయకులు తోట శివసాయి, ఓబులవారిపల్లె మండల పార్టీ అధ్యక్షుడు వత్తలూరి సాయికిషోర్‌రెడ్డి, చిట్వేలి మండల పార్టీ అధ్యక్షుడు చెవ్వు శ్రీనివాసులురెడ్డి, ఉర్లగట్టుపోడు నాయకులు రాజ తదితరులు పాల్గొన్నారు.