ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలి

ABN , First Publish Date - 2020-11-07T04:42:13+05:30 IST

టీడీపీ హయాంలో నిర్మించిన ఇండ్లను పేదలకు పంపి ణీ చేయాలని కడప పార్లమెంటరీ టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్వేతారె డ్డి, బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు.

ఇండ్లను పేదలకు పంపిణీ చేయాలి

బద్వేలు, నవంబరు6: టీడీపీ హయాంలో నిర్మించిన ఇండ్లను పేదలకు పంపి ణీ చేయాలని కడప పార్లమెంటరీ టీడీపీ పార్టీ మహిళా అధ్యక్షురాలు శ్వేతారె డ్డి, బద్వేలు నియోజకవర్గ టీడీపీ నేత డాక్టర్‌ ఓబుళాపురం రాజశేఖర్‌ పేర్కొన్నారు.  ‘నా ఇల్లు- నా సొంతం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం సుమిత్రానగర్‌కు చెందిన ఫాతిమా, సబీహా టిడ్కో లబ్ధిదారులతో కలిసి నిరసన చేపట్టిన వారు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వం అన్ని సౌకర్యాలతో  నియోజకవర్గంలో సుమారు 250మంది లబ్ధిదారులకు ఇండ్ల నిర్మాణం చేశామన్నారు. లబ్ధిదారులతో డిపాజిట్‌ చేయించుకున్నా ఇప్పటివరకు వైసీపీ ప్రభుత్వం లబ్ధి దారులకు ఎందుకు అందజేయలేదని ప్రశ్నించారు.  పేద ప్రజలను జగనమోహనరెడ్డి ప్రభుత్వం మోసం చేస్తోందని బడుగు, బలహీనవర్గాలపై కక్షపూరితంగా వ్యవహరిస్తోందని వారు ఆగ్రహం వ్యక్తం చేశారు. పేదలకు హౌసింగ్‌ బిల్లులు మంజూరు చేయకుండా నిలిపేయడం దారుణమన్నారు. రాష్ట్రమైనార్టీ కార్పొరేషన మాజీ డైరెక్టర్‌ మహబూబ్‌బాష, జిల్లా మైనార్టీ ఉపాధ్యక్షు డు జహంగీర్‌, తెలుగు యువత కార్యనిర్వహక కార్యదర్శి పుష్పరాజు, సీనియ ర్‌ నేతలు బాదుల్లా, వెంకటేష్‌, జోగేష్‌, సయ్యద్‌బాష పాల్గొన్నారు.

Updated Date - 2020-11-07T04:42:13+05:30 IST