ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేయండి

ABN , First Publish Date - 2020-12-20T05:14:56+05:30 IST

ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు.

ఇళ్ల పట్టాల పంపిణీని విజయవంతం చేయండి

రాయచోటిటౌన్‌, డిసెంబరు19: ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ప్రభుత్వ చీఫ్‌ విప్‌ శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. శనివారం ఆయన పట్టణంలోని వైసీపీ కార్యాలయంలో డిప్యూటీ కలెక్టర్‌ సృజన, తహసీల్దార్‌ సుబ్రహ్మణ్యంరెడ్డితో ఇళ్ల పట్టాల పంపిణీ, వైఎ్‌సఆర్‌ జగనన్న కాలనీ నిర్మాణ ప్రారంభ కార్యక్రమాలపై సమీక్షించారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ రాయచోటి పట్టణ పరిధిలోని నారాయణరెడ్డిగారిపల్లె సమీపంలో రాయచోటి పట్టణ పేదల కోసం ఏర్పాటు చేసిన లేఅవుట్‌ రాష్ట్ర స్థాయిలో ఒక పెద్ద లేఅవుట్‌ అవుతుందన్నారు.   కొవిడ్‌ నిబంధనలను పాటిస్తూ ప్రారంభ కార్యక్రమాలను చేపట్టాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డీసీసీబీ డైరెక్టర్‌ వెంకట్రామిరెడ్డి, మార్కెట్‌ కమిటీ మాజీ చైర్మన్‌ కొలిమి హారూన్‌బాషా, వైసీపీ నాయకులు జిన్నా షరీఫ్‌, కూరగాయల మహబూబ్‌బాషా పాల్గొన్నారు.

Updated Date - 2020-12-20T05:14:56+05:30 IST