పారదర్శకంగా ఇంటి పట్టాల పంపిణీ

ABN , First Publish Date - 2020-11-22T04:35:59+05:30 IST

పారదర్శకంగా ఇంటి పట్టాల పంపిణీ ఉంటుందని రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు.

పారదర్శకంగా ఇంటి పట్టాల పంపిణీ
రైల్వేకోడూరు మండలం అనంతరాజుపేటలో స్థల రికార్డులు పరిశీలిస్తున్న సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌

రైల్వేకోడూరు రూరల్‌, నవంబరు 21: పారదర్శకంగా ఇంటి పట్టాల పంపిణీ ఉంటుందని రాజంపేట సబ్‌ కలెక్టర్‌ కేతన్‌గార్గ్‌ తెలిపారు. శనివారం రైల్వేకోడూరు మండలంలోని అనంతరాజుపేట,రెడ్డివారిపల్లె, గుండాలపల్లె  తదితర గ్రామాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అనంతరాజుపేటలో వ్యవసాయభూమిని వ్యవసాయేతర భూమిగా మార్చుకుని డెయిరీ, నర్సరీ ఏర్పాటు చేసుకుంటామని పలువురు అర్జిలు ఇచ్చారు.  దీంతో భూములు, అందుకు సంబంధించిన రికార్డులు పరిశీలించారు. గుండాలపల్లె వద్ద పెట్రోల్‌ బంకు ఏర్పాటు చేసుకునేందుకు స్థలాన్ని పరిశీలించామని తెలిపారు. రెడ్డివారిపల్లెలో ప్రభు త్వం ఇచ్చే ఇంటి పట్టాల భూమిని పరిశీలించినట్లు తెలిపారు. అర్హులైన పేదలందరికీ ఇంటి పట్టాలు డిసెంబరు 25న పంపిణీ చేస్తున్నట్లు వివరించారు. ఆయన వెంట రైల్వేకోడూరు తహసీల్దార్‌ శిరీషా, ఆర్‌ఐ సుశీల్‌కుమార్‌, సిబ్బంది పాల్గొన్నారు.

 

Read more