కమీషన్‌తోపాటు గౌరవవేతనం ఇవ్వాలి
ABN , First Publish Date - 2020-08-11T11:14:54+05:30 IST
చౌక దుకాణ డీలర్లకు కమీషన్‌తో పాటు గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి జమ్మలమడుగు రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు.

జమ్మలమడుగు రూరల్, ఆగస్టు 10: చౌక దుకాణ డీలర్లకు కమీషన్‌తో పాటు గౌరవ వేతనం ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి జమ్మలమడుగు రేషన్ డీలర్లు విజ్ఞప్తి చేశారు. ఆమేరకు సోమవారం జమ్మలమడుగు ఆర్డీవో నాగన్నకు వారొక వినతిపత్రం అందజేశారు. దశాబ్ధాలుగా తాము డీలర్లుగా పనిచేస్తున్నామని ప్రస్తుత కరోనా వల్ల ఏదైనా ప్రమాదం సంభవిస్తే తమ కుటుంబా లు ఇబ్బందులు పడాల్సి వస్తుందని అందువల్ల ప్రభుత్వం అన్నివిధాల తమను ఆదుకోవాలని కోరారు. బియ్యం దిగుమతి చేసే సమయంలో తామే కూలీలకు దిగుమతి ఛార్జీలు అందిస్తున్నామని, తమ సమస్యను ఎవరూ పట్టించుకోవడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా ప్రభుత్వం చౌకదుకాణ డీలర్ల సమస్యలను పరిష్కరించాలని వారు విజ్ఞప్తి చేశారు.