హోంగార్డు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : ఎస్పీ

ABN , First Publish Date - 2020-12-21T05:24:01+05:30 IST

జిల్లాలో హోంగార్డు విభాగంలో 75 ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ ప్రకటనలో పేర్కొన్నారు.

హోంగార్డు పోస్టుల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానం : ఎస్పీ

కడప(క్రైం), డిసెంబరు 20: జిల్లాలో హోంగార్డు విభాగంలో 75 ఉద్యోగాలకు సంబంధించి ఈ నెల 26 నుంచి 31 వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఎస్పీ అన్బురాజన్‌ ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో స్థానికంగా ఉన్న 18-50 ఏళ్ల వయసు గల పురుషులు, మహిళా అభ్యర్థులు అర్హులన్నారు. విద్యార్హత ఎస్‌ఎ్‌ససీ లేదా ఏడో తరగతి కలిగి ఉండాలని, శరీర అర్హతలు పురుషులు 165 సెం.మీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు 160 సెం.మీ కలిగి ఉండాలని, మహిళలైతే 150 సెం.మీ, ఎస్సీ, ఎస్టీలు అయితే 145 సెం.మీ కలిగి ఉండాలని తెలిపారు. ఎంపికైన వారికి రోజుకు రూ.710 చెల్లిస్తామని, అభ్యర్థులు అవసరమైన చోట ఏ ప్రాంతంలోనైనా డిపార్ట్‌మెంటు ఉత్తర్వుల ప్రకారం పనిచేసేందుకు సిద్ధంగా ఉండాలని పేర్కొన్నారు. దరఖాస్తు ఫారాలు సమీపంలోని అన్ని పోలీ్‌సస్టేషన్లలో అందుబాటులో ఉంటాయని, ఎంపిక ప్రక్రియల్లో దళారులను నమ్మి మోసపోవద్దని సూచించారు. పోటీ పరీక్షల తేదీని పత్రిక ప్రకటనల ద్వారా తెలియపరుస్తామని తెలిపారు. 

Updated Date - 2020-12-21T05:24:01+05:30 IST