హోంగార్డుల సేవలు అభినందనీయం

ABN , First Publish Date - 2020-12-07T04:46:19+05:30 IST

కొవిడ్‌, లాక్‌డౌన్‌, నివర్‌ తుఫాన్‌, ఎన్నికలు, బంద్‌, బందోబస్తు సమయాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు.

హోంగార్డుల సేవలు అభినందనీయం
మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం అంజద్‌బాషా

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవంలో డిప్యూటీ  సీఎం అంజద్‌బాషా


కడప(క్రైం), డిసెంబరు 6: కొవిడ్‌, లాక్‌డౌన్‌, నివర్‌ తుఫాన్‌, ఎన్నికలు, బంద్‌, బందోబస్తు సమయాల్లో హోంగార్డుల సేవలు అభినందనీయమని డిప్యూటీ సీఎం ఎస్‌బీ అంజద్‌బాషా అన్నారు. కడప నగరంలోని పోలీసు పరేడ్‌ మైదానంలో 58వ హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఎస్పీ కేకేఎన్‌ అన్బురాజన్‌ ఉప ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు ఇచ్చి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం ఆయన హోంగార్డుల గౌరవ వందనం స్వీకరించి వాహనం నుంచి పరేడ్‌ను పరిశీలించారు. ఈ సందర్భంగా అంజద్‌బాషా మాట్లాడుతూ పోలీసుశాఖలో భాగమైన హోంగార్డులు చేస్తున్న సేవలు గొప్పవన్నారు. శాంతి భద్రతల పరిరక్షణతో పాటు ఇతర విభాగాలైన విజిలెన్స్‌, రవాణా, ట్రాన్స్‌కో, జైళ్ల శాఖ తదితర విభాగాల్లో కూడా క్రమశిక్షణతో నిర్వహిస్తున్నారన్నారు. వారి సేవలను గుర్తుంచుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందన్నారు. ఎస్పీ తన ఆధ్వర్యంలో దాదాపు 2వేల మంది ప్రజలను రక్షించి ప్రజల మనసులో చెరగని ముద్ర వేశారన్నారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి హోంగార్డులకు 18వేల నుంచి 21,300 పెం చారన్నారు. నెలకు రెండురోజుల వేతనాలతో కూడిన సెలవులు మంజూరు చేశా మ న్నారు. అనంతరం ఎస్పీ అన్బురాజన్‌ మాట్లాడుతూ హోంగార్డులు పోలీసులతో సమానంగా విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా 710 మంది హోంగార్డులు పనిచేస్తున్నారని, వారిలో 58 మంది మహిళలు ఉన్నారన్నారు.  


డిప్యూటీ సీఎంకు సన్మానం

హోంగార్డుల వ్యవస్థాపక దినోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన డిప్యూటీ సీఎం అం జద్‌బాషాను ఎస్పీ అన్బురాజన్‌ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన హోంగార్డులకు డిప్యూటీ సీఎం చేతుల మీదుగా ప్రశంసాపతాల్రు, బహుమతులు అందజేశారు. అనంతరం నగరంలో ర్యాలీ నిర్వహించారు. అదనపు ఎస్పీలు ఖాసింసాహెబ్‌, దేవప్రసాద్‌, ఏఆర్‌ డీఎస్పీ రమణయ్య, కడప డీఎస్పీ సునీల్‌, ఎస్సీ ఎస్టీ సెల్‌ డీఎస్పీ రవికుమార్‌, సీసీఎస్‌ డీఎస్పీ రంగనాయకులు, దిశ మహిళా పోలీసుస్టేసన్‌ డీఎస్పీ షౌకత్‌ఆలీ, ఆర్‌ఐలు పాల్గొన్నారు.

Updated Date - 2020-12-07T04:46:19+05:30 IST