-
-
Home » Andhra Pradesh » Kadapa » High level to Gowda caste
-
గౌడ కులస్థుల అభ్యున్నతికి కృషి
ABN , First Publish Date - 2020-12-28T05:13:45+05:30 IST
గౌడ కులస్థుల అభ్యన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర ఈడిగ సంక్షేమ సంఘం డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్ పేర్కొన్నారు.

ఈడిగ సంక్షేమ సంఘ డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్
ముద్దనూరు డిసెంబరు27:గౌడ కులస్థుల అభ్యన్నతికి కృషి చేస్తానని రాష్ట్ర ఈడిగ సంక్షేమ సంఘం డైరెక్టర్ దాసరి చిదానందగౌడ్ పేర్కొన్నారు. మండల పరిధిలోని పెనికెలపాడు గ్రామంలోని డీసీసీ బ్యాంక్ మాజీ చైర్మన్ కాటమయ్య గౌడ్ స్వగృహంలో ఆదివారం గౌడ కులస్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి గౌడలకు అందాల్సిన సంక్షేమ ఫలాలు అందేలా కృషి చేస్తానన్నారు. ముఖ్యం గా కల్లుగీత కార్మికులకు అర్హులైన ప్రతి ఒక్కరికి పెన్షన్ అందేలా చూస్తామన్నారు. అనంతరం చిదనందగౌడ్‌కు ఘనంగా సన్మానం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఈడిగ సంక్షేమ సంఘం అధ్యక్షుడు మురళీగౌడ్, ప్రధాన కార్యదర్శి కొండయ్య గౌడ్, ఉపాధ్యక్షులు కొడతాల వరప్రసాద్‌గౌడ్, గౌడ ఉద్యోగుల సంఘం జిల్లా అధ్యక్షుడు రామ్మోహనగౌడ్ , గౌడ సంఘం నాయకులు పాల్గొన్నారు.