కోదండరామున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ABN , First Publish Date - 2020-03-16T10:43:52+05:30 IST

ఏకశిలా నగిరి అయిన కోదండరామాలయాన్ని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌

కోదండరామున్ని దర్శించుకున్న హైకోర్టు న్యాయమూర్తి

ఒంటిమిట్ట, మార్చి 15 : ఏకశిలా నగిరి అయిన కోదండరామాలయాన్ని ఆదివారం ఉదయం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ప్రవీణ్‌కుమార్‌ దర్శించుకున్నారు. వీరికి టీటీడీ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం రంగమండపంలో వేదపండితులు ఆశీర్వచనం నిర్వహించి తీర్ధప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమం లో పోర్ట్‌ఫోలియో జడ్జి పవన్‌కుమార్‌, సిద్దవటం జడ్జి రాజశేఖర్‌, ప్రోటోకాల్‌ అధికారి మహమ్మద్‌బాషా, ఎస్‌ఐలు అమర్‌నాధరెడ్డి, రమే్‌షబాబు, పోలీసు సిబ్బంది, టీటీడీ అర్చకులు రాఘవాచార్యులు, మనోజ్‌, టీటీడీ ఇన్స్‌పెక్టర్‌ యువరాజు, పలువురు పాల్గొన్నారు.

Updated Date - 2020-03-16T10:43:52+05:30 IST