అమెరికాలో బోర్డు మెంబర్‌గా కడప జిల్లా వాసి

ABN , First Publish Date - 2020-03-04T10:15:54+05:30 IST

కడప జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు అమెరికాలో వైద్యక్రమశిక్షణా సంఘం బోర్డు రాష్ట్ర స్థాయి మెంబర్‌గా

అమెరికాలో బోర్డు మెంబర్‌గా కడప జిల్లా వాసి

జమ్మలమడుగు రూరల్‌, మార్చి 3: కడప జిల్లాకు చెందిన ప్రవాసాంధ్రుడు అమెరికాలో వైద్యక్రమశిక్షణా సంఘం బోర్డు రాష్ట్ర స్థాయి మెంబర్‌గా ఎంపికయ్యారు. జమ్మలమడుగుకు చెందిన గుద్దేటి శ్రీనివాసరెడ్డి అమెరికాలో మెడిసిన్‌ చదివి అక్కడే స్థిరపడ్డారు. ప్రస్తుతం అక్కడ 20 ఏళ్లుగా రేడియాలజిస్టు (ఎండీ)గా పనిచేస్తున్నారు. ఈయన భార్య లలిత అమెరికాలోనే చర్మవాధి నిపుణురాలిగా పనిచేస్తున్నారు.


ఇటీవల అమెరికాలోని ఇల్లినాయిస్‌ రాష్ట్ర గవర్నర్‌ ప్రైజ్‌కర్‌ శ్రీనివాసరెడ్డిని వైద్యక్రమశిక్షణా సంఘం బోర్డు రాష్ట్ర స్థాయి మెంబర్‌గా ఎంపిక చేశారు. ఈ మేరకు శ్రీనివాసరెడ్డి తండ్రి విశ్రాంత ఉపాధ్యాయుడు నరసింహారెడ్డి మంగళవారం మీడియాకు సమాచారం తెలిపారు. 

Updated Date - 2020-03-04T10:15:54+05:30 IST